Naresh : నటుడు నరేష్, పవిత్ర లోకేష్, రమ్య రఘుపతిల వ్యవహారం రోజు రోజుకీ ముదురుతోంది. రమ్య రఘుపతి ఓ కన్నడ న్యూస్ చానల్‌లో గత 3 రోజుల క్రితం ప్రత్యక్షమై హడావిడి చేసింది. దీంతో నరేష్ స్వయంగా బెంగళూరు వెళ్లి వివరణ ఇచ్చుకున్నారు. అయితే తాజాగా మళ్లీ ఓ తెలుగు న్యూస్ చానల్ కూడా చర్చ నిర్వహించగా.. అందులో నరేష్, పవిత్ర, రమ్యలు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. రమ్య మాట్లాడుతూ.. నరేష్ తనను ఎన్నో రకాలుగా బెదిరించారని అన్నారు. తనకు గన్ గురి పెట్టి విడాకులు కావాలని అడిగారని వాపోయారు.
పవిత్ర లోకేష్, నరేష్‌ల మధ్య సంబంధం ఉందని రమ్య అన్నారు. తాను ఇప్పటికీ తన భర్తతో కలిసి ఉండేందుకే యత్నిస్తున్నానని.. ఎలాగైనా సరే మ్యాటర్‌ను సెటిల్ చేసుకోవాలని చూస్తున్నానని.. కానీ నరేష్ మాత్రం బెదిరింపులకు పాల్పడుతున్నారని రమ్య ఆరోపించారు. అయితే ఇందుకు నరేష్ కౌంటర్ ఇచ్చారు. రమ్య అసలు స్వరూపం ఎవరికీ తెలియదని.. తనతో విసిగిపోయి తనను దూరం పెట్టానని తెలిపారు. తనకు ఓ బాబు పుట్టాడని.. ఆ తరువాత నుంచి ఆమె మారిపోయిందని తెలిపారు. తన వద్ద కారు డ్రైవర్‌గా పనిచేసిన ఓ హ్యాడ్‌సమ్ ముస్లిం డ్రైవర్‌తో ఆమె సంబంధం పెట్టుకుందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. వారిని తాను రెడ్ హ్యాండెడ్‌గా కూడా పట్టుకున్నానని అన్నారు.

అలాగే ఒకసారి రమ్య క్యాబ్ లో ఇంటికి వచ్చిందని.. ఆ క్యాబ్ డ్రైవర్‌తోనూ సంబంధం పెట్టుకుందని నరేష్ ఆరోపించారు. అసలు ఆమె వ్యక్తిత్వం మంచిది కాదని.. ఆమె స్వభావం తెలిశాక ఆమెను దూరంగా ఉంచేశానని అన్నారు. అయితే త్వరలోనే ఆమెకు విడాకులు ఇస్తున్నానని తెలిపారు. ఇక పవిత్ర లోకేష్, తాను ప్రస్తుతం సూపర్ స్టార్ కృష్ణ ఫామ్ హౌస్‌లో ఉంటున్నామని, తమ పెళ్లికి ఆయన అంగీకరించారని.. దీంతో త్వరలోనే తాము వివాహం చేసుకుంటామని తెలిపారు.