Heroines : అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌లో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీరే..!

Heroines : తాము అభిమానించే తారల జీవితంలో జరిగే విషయాల గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిళ్లు, లవ్ స్టోరీల‌ గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఇంకా ఎక్కువ ఆసక్తి చూపుతారనే చెప్పవచ్చు. మరీ అభిమానులు అంతగా ఇంట్రెస్ట్ చూపే విశేషాలు మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ఇంతకీ ఆ విశేషాలు ఏంటంటే.. టాలీవుడ్ లో కొంత‌మంది హీరోయిన్ లు సీక్రెట్ గా పెళ్లి చేసుకుని వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు ఆ హీరోయిన్ లు ఎవ‌రో  చూద్దాం.

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ మ‌హాన‌టి సావిత్రి తమిళ హీరో జెమిని గ‌ణేష‌న్ ను సీక్రెట్ గా వివాహం చేసుకుని వార్తల్లో హాట్ టాపిక్ గా మారారు. ల‌క్స్ స‌బ్బు ప్ర‌మోష‌న్స్ లో భాగంగా సావిత్రి జెమిని గ‌ణేష‌న్ అని సంత‌కం చేయ‌డంతో ఆమె వివాహం చేసుకున్న సంగ‌తి బ‌య‌ట‌ప‌డింది. కానీ అప్ప‌టికే జెమిని గ‌ణేష‌న్ కు వివాహం జరిగింది. జెమిని గణేషన్ సావిత్రిని రెండో వివాహం చేసుకున్నారు.

Heroines

మరో స్టార్ హీరోయిన్ జ‌య‌ప్ర‌ద కూడా 1986 జూన్ 22వ తేదీన సీక్రెట్ గానే వివాహం చేసుకున్నారు. జ‌య‌ప్ర‌ద బాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ నహతాని వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ కి అప్ప‌టికే వివాహమై పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ కోవలోనే అతిలోక సుందరి శ్రీదేవి కూడా సీక్రెట్ గానే వివాహం చేసుకుంది. శ్రీదేవి హీరోయిన్ గా బిజీగా ఉన్న స‌మ‌యంలోనే నిర్మాత బోనీక‌పూర్ తో ప్రేమ‌లో ప‌డింది. అప్ప‌టికే బోనీక‌పూర్ కు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు. బోనీక‌పూర్ శ్రీదేవిని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పట్లో ఈ విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ ఇలా రెండో వివాహం చేసుకోవడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోయారు.

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన ముద్దుల మావ‌య్య సినిమాలో ఆయ‌న‌కు సోద‌రిగా న‌టించిన సీత కూడా సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. సీత కోలీవుడ్ లో హీరోయిన్ గా స‌క్సెస్ అయ్యారు. సీత 2010లో సీరియ‌ల్ న‌టుడు స‌తీష్ ను సీక్రెట్ గా వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు.

2003లో రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీని సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు. చాలా కాలం ప్రేమాయణం నడిపిన తర్వాత వివాహబంధంతో ఈ జంట ఒకటయ్యారు. అదేవిధంగా అగ్రస్థాయి కథానాయకులు అందరితోనూ నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించిన శ్రీయ కూడా సీక్రెట్ గానే పెళ్లి చేసుకుని వార్త‌ల్లో నిలిచింది. శ్రీయ ర‌ష్యాకు చెందిన ఆండ్రి కోషివ్ తో ప్రేమలో ప‌డింది. సీక్రెట్ గా మే 19, 2018 లో ఆండ్రిని వివాహం చేసుకుంది శ్రీయ. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుని బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చేవర‌కూ వీరి పెళ్లి విషయం బయటకు రాలేదు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM