Panic Attack : గుండెల్లో గాభ‌రాగా ఉండి ఒళ్లంతా చెమ‌ట‌లు ప‌డుతున్నాయా.. ఇలా చేయండి.. లేక‌పోతే ప్ర‌మాదం..

Panic Attack : కొందరు తీవ్రమైన ఆందోళన, తెలియని భయం, అతి కోపం మరియు సంతోషంతో కొన్ని సమయాలలో పానిక్ ఎటాక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పానిక్ ఎటాక్ కలిగినప్పుడు మానసిక స్థితి అయోమయంగా అయిపోతుంది. ఈ అయోమయ స్థితి వచ్చినప్పుడే మనిషి నియంత్రణ కోల్పోయి కాస్త పానిక్ ఎటాక్ వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా పానిక్ ఎటాక్ వచ్చినప్పుడు వెంటనే అధికంగా చెమటలు పట్టేస్తాయి.  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొంతమంది కళ్ళు తిరిగి సడన్ గా పడిపోతారు. ఒక వ్యక్తి పానిక్ ఎటాక్ కు గురైనప్పుడు వాంతులు అవుతున్నట్లు అనిపించడం, కాళ్లు, చేతులు అధికంగా వణకడం, ఒక్కోసారి ఛాతిలో నొప్పిగా అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో లాస్ ఆఫ్ బాడీ కంట్రోల్ మెయిన్ గా జరుగుతుంది.

ఈ పానిక్ ఎటాక్ వచ్చిన వారిని వెంటనే ఖాళీ ప్రదేశంలో ఉంచాలి. వారు ఉండే ప్రదేశంలో తక్కువ వెలుతురు ఉండేలా చూసుకోవాలి. వాళ్లను షాక్ కి గురి చేసే విషయాలు వాళ్ల దగ్గర ప్రస్తావించకూడదు. పానిక్ ఎటాక్ గురైన వ్యక్తికి భారీ శబ్దాలు వినిపించకుండా జాగ్రత్త వహించాలి. ఛాతిలో నొప్పి, చెమట తగ్గి సాధారణ స్థితికి రాగానే వాళ్లకి కొబ్బరి నీళ్లు గాని, నిమ్మకాయ, తేనె కలిపిన నీటిని గాని తాగించాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. వాళ్ళు ధైర్యంగా ఉండడానికి కాస్త పాజిటివ్ గా మాట్లాడి ఓదార్చి నాలుగు మంచి మాటలతో ఆ వ్యక్తి సాధారణ స్థితికి వచ్చే వరకు జాగ్రత్త వహించాలి. ఇలా చేస్తే శరీరం మొత్తం 5-10 నిమిషాల్లో ఫ్రీ అయిపోతుంది. కొంత మందికి సైకలాజికల్ గా జనాలు ఎక్కువగా గుంపులుగా ఉన్నప్పుడు వాళ్లకి పానిక్ ఎటాక్ వస్తుంది. అదేవిధంగా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇలా అనిపిస్తుంది.

Panic Attack

ఇలాంటి వారు హోమియో మెడిసిన్ వాడడం మంచిది. ఇలా అతి భయం, అతి కోపం, అతి సంతోషం వచ్చేవాళ్ళు మాత్రం రెగ్యులర్ గా మెడిటేషన్,  ప్రాణాయామం చేయడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే పానిక్ ఎటాక్ తో ఇబ్బంది పడేవారు పాజిటివ్ థింకింగ్ లో ఉండడం, సెలీనియం ఎక్కువగా ఉండే బ్రెజిల్ నట్స్ వంటివి నిత్యం ఆహారంలో తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఫ్రూట్స్, నట్స్ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం వలన పేగుల్లో సెరటోనిన్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది. నలుగురితో హ్యాపీగా ఉంటే డోపామిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇలా చేయటం వలన పానిక్ ఎటాక్ రాకుండా రక్షించుకోవచ్చు.

Share
Mounika

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM