Anchor : టెలివిజన్ లో ఓ కామెడీ షో తో పాపులర్ అయిన ఓ సీనియర్ స్పైసీ యాంకర్ గురించి అందరికీ తెలిసిందే. ఈ యాంకర్ పాపులర్ అవ్వడానికి తన గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా వెనకాడలేదు. నిజానికి అలాంటి ఫొటోల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయింది. ఆమెకు పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, ఆ యాంకర్ ఎప్పుడూ కొన్ని రివీల్ అవతారాలలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేయడం మానుకోలేదు.
ఈ అపరిమిత గ్లామర్ ట్రీట్ ఆమె వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించిందని సమాచారం. ఎందుకంటే ఆమెకు కష్టసమయాల్లో తోడుగా ఉన్న అత్తమామలు ఇంటి నుండి బయటికి వెళ్లిపోయారు. ఏదో చిన్న బిజినెస్ చేసే యాంకర్ భర్త తన భార్య గ్లామరస్‌గా కనిపించినా సరే, స్కిన్ షోలు, పార్టీలతో కూడా ఆమె హద్దులు దాటుతోందని అతని తల్లిదండ్రులు భావించినట్లు సమాచారం.

హఠాత్తుగా ఈ యాంకర్ అందరికీ అందుబాటులో లేకుండా పోయింది. కానీ రెండు రోజుల తర్వాత భార్య, భర్త మధ్య కూడా విషయాలు సర్దుకుపోయినట్లు కనిపిస్తోంది. అత్తమామలు తిరిగి రానప్పటికీ పాపులారిటీ కోసం గ్లామర్ గా కనిపించొద్దని భర్త కోరినట్లు సమాచారం. ఇప్పుడు ఆ యాంకర్ తిరిగి షూటింగ్ లలో బిజీ అయింది. ఇక మీదట ఆ యాంకర్ భర్త చెప్పినట్టు వింటుందో లేక అంత నా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తుందో చూడాలి. ఇటీవల ఆమె నటించిన సినిమా పెద్దగా ఫలితం దక్కలేదు.