Viral Video : ఇంటర్నెట్ లో ఎప్పుడు ఏది వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని వీడియోలను చూసిన తర్వాత కూడా నమ్మలేనివిగా ఉంటాయి. ఎలుక, పిల్లికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మందు తాగితే మనుషులకే కాదు జంతువులకు కూడా కిక్కు ఇస్తుందని నిరూపించింది ఓ ఎలుక. పిల్లుల కంటే ఎలుకలు ఎప్పుడూ బలహీనంగా ఉంటాయి. ఎలుకలు పిల్లులకు భయపడి పారిపోతుంటాయి. కానీ ఈ వీడియోలో మాత్రం రివర్స్ అయింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ ఇంట్లో ఓ గ్లాస్‌లో మద్యం పోసి ఉంది. ఓ ఎలుక నెమ్మదిగా ఆ గ్లాసు దగ్గరికి వచ్చి అందులో ఉన్న మద్యాన్ని గట గటా తాగింది. కొంత సమయం తర్వాత ఆ ఎలుక బాహుబలిగా మారి పిల్లులపై దాడి చేసింది. ఎలుక దాడిని తట్టుకోలేక పిల్లులు అక్కడి నుంచి దూరంగా పారిపోతాయి.

కాగా ఆ ఎలుకకు సంబంధించిన ఫన్నీ వీడియోను ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశారు. మద్యం మత్తు ఎలాంటి పనినైనా చేయిస్తుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఇక ఈ వీడియోను చూసిన అందరూ షాక్ అవుతున్నారు. కాగా ఆ బాహుబలి ఎలుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరోవైపు నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
View this post on Instagram