సాధారణంగా కొన్ని పుష్పాలు ఎప్పుడు వికసించకుండా కొన్ని కాలాలలో మాత్రమే వికసిస్తూ ఉంటాయి. అయితే కొన్ని పుష్పాలను ఎంతో పవిత్రమైన పుష్పాలుగా, దేవతా పుష్పాలుగా భావిస్తారు. అలాంటి వాటిలో బ్రహ్మకమలం ఒకటి. బ్రహ్మ కమలాలు అన్ని పుష్పాల మాదిరిగా కాకుండా రాత్రిపూట మాత్రమే వికసిస్తూ కనువిందు చేస్తాయి. ఇలా బ్రహ్మకమలాలు వికసించడంతో చాలామంది వీటిని పవిత్రంగా భావించి పూజలు కూడా చేస్తారు.
ఇలాంటి బ్రహ్మకమలం సోమవారం రాత్రి నల్గొండ జిల్లా అమూల్య కాలనీలో పుష్పాల వెంకన్న నివాసంలో వికసించడంతో ఆ పుష్పాన్ని చూడడానికి చుట్టుపక్కల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వికసించి.. కొంత సమయం పాటు తాజాగా ఉండే ఈ పుష్పాన్ని చూడటం కోసం స్థానికులు పెద్ద ఎత్తున అతని ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ 2020 సంవత్సరంలో బ్రహ్మ కమలం మొక్కని నాటానని అయితే కేవలం స్వచ్ఛమైన నీరు బ్రహ్మకమలానికి పోసినప్పుడు మాత్రమే ఆ మొక్క మనుగడ ఉంటుందని తెలియజేశాడు. ప్రస్తుతం తన ఇంటిలో పూసిన బ్రహ్మ కమలాన్ని చూడటం కోసం స్థానికులు అందరూ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని.. ఎంతో పవిత్రమైన పుష్పం వికసించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…