చాలామంది వారికి జీవితంలో ఏ విధమైనటువంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో సాగిపోవాలని.. సంపదలు కలసి రావాలని భావిస్తారు. ఈ క్రమంలోనే డబ్బులను సంపాదిస్తుంటారు. ఇలా డబ్బులను సంపాదిస్తున్నప్పటికీ కొంత మంది దగ్గర ఏ మాత్రం డబ్బు నిల్వ ఉండదు. ఇలా చేతిలో డబ్బు నిల్వలేని వారు కొన్ని పనులను చేయటం వల్ల ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధిస్తారని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మనకు సంపద కలగాలని లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం మనం చూస్తూ ఉంటాము. మనకు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడంతోపాటు అష్టైశ్వర్యాలు కలగాలంటే ఈ పనులు తప్పనిసరిగా చేయాలని పండితులు తెలియజేస్తున్నారు.
మహిళలు ప్రతి రోజూ ఉదయం లేవగానే పాలు కాచడం అలవాటుగా ఉంటుంది. పాలు కాచే ముందు నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించింది కనుక పాలను కూడా సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఈ క్రమంలోనే పాలను కాచే ముందు.. ముందుగా పొయ్యిని (స్టవ్‌ని) శుభ్రం చేసుకొని గంధం, పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి నమస్కరించుకోవాలి. ఇలా చేసిన అనంతరం పాలు కాచాలి.
అదే విధంగా చాలా మంది పాలను పొయ్యిపై పొంగిస్తుంటారు. ఇలా పాలు పొంగిన తర్వాత పాలలో రెండు బియ్యపు గింజలు వేస్తే అంతా శుభం జరుగుతుంది. అలాగే తొందరగా పాలు చల్లారాలని చాలా మంది పాలు కాగిన తర్వాత పాలపై ఉన్న మూతను తొలగిస్తారు. అలా చేయడం వల్ల పాల నుంచి ఆవిరి ఏ విధంగా అయితే బయటకు వెళ్తుందో అదే విధంగా మన ఇంట్లో ఉన్న సంపద మొత్తం వెళ్ళిపోతుందని పండితులు చెబుతున్నారు. కనుక పాలు కాచే సమయంలో ఈ నియమాలను పాటించడం వల్ల మనం సంపాదించుకున్న డబ్బు వృథా ఖర్చు కాకుండా మన సంపదను వృద్ధి చేసుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…