తెలుగు చిత్ర పరిశ్రమలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరుపొందిన అక్కినేని నాగచైతన్య, సమంతల గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ వీరి గురించి వార్తలు వినిపిస్తున్నప్పటికీ సమంత – చైతన్య ఈ విషయంపై స్పందించలేదు. సమంత పలు ట్వీట్స్ చేస్తూ ఈ విషయాల గురించి బయట పెడుతున్నప్పటికీ నాగచైతన్య మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో “S” అని పెట్టినప్పటినుంచి వీరి విడాకులపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అసలు నాగ చైతన్య, సమంతల మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే..
ఒక సాధారణ కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చిన సమంతకు సినిమాలంటే ఎంతో ఇష్టం. సినిమాలపై ఉన్న ఇష్టతతో ఎన్నో అద్భుతమైన పాత్రలలో నటించి ఈ స్థాయికి చేరుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈమె ఏమాత్రం సినిమా అవకాశాలను వదులుకోకుండా ఎక్కువగా గ్లామరస్, స్కిన్ షో లను చేయడం అక్కినేని కుటుంబానికి నచ్చలేదు. సినిమాలు వదులుకొని అమల మాదిరిగా ఉండాలని అక్కినేని కుటుంబం సూచించడం తనకి నచ్చలేదు. దీంతో ఈ జంట మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు తెలుస్తోంది.
ఇక తాజాగా సమంత నటించిన “ది ఫ్యామిలీ మ్యాన్ 2” సిరీస్ లో రాజీ పాత్రలో సమంత ఎంతో బోల్డ్ గా నటించింది. ఇలా పెళ్లి తర్వాత సమంత స్కిన్ షో చేయడం నచ్చకపోవడంతో తన పద్ధతి మార్చుకోవాలని నాగచైతన్య సూచించాడు. అప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఈ విషయమే వీరి విడాకులకు దారి తీసిందని ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే వీరు విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో హాజరు అయ్యారని, దీంతో వీరికి కౌన్సెలింగ్ ఇచ్చారని, అయినా కూడా వీరు విడాకులు తీసుకోవాలనే ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. విడాకుల తంతు పూర్తయిందని, మరొక రెండు, మూడు నెలలలో విడాకులు రాబోతున్నాయని, సమంతకి నాగచైతన్య తన స్థిర, చరాస్తులు మొత్తం రూ.50 కోట్ల వరకు భరణంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజుల నుంచి ఇవే వార్తలు అనేక సైట్లలో వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…