ఈ మధ్య కాలంలో ఎంతో మంది యువతీ యువకులు పెద్ద చదువులు చదువుకున్నప్పటికీ కేవలం క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా వికారాబాద్ కి చెందిన ఓ వివాహిత కేవలం తన తల్లిదండ్రులు పెళ్లి సమయంలో చెప్పిన మాట ప్రకారం బంగారం ఇవ్వలేదన్న కారణంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లికి చెందిన ఊరడి మమత అనే యువతి, స్థానిక రామయ్యగూడకు చెందిన నవీన్ లు రెండేళ్ల క్రితం పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి సమయంలో మమత తండ్రి తనకు మూడు తులాల బంగారం కానుకగా ఇస్తానని చెప్పాడు. తన పెళ్లి జరిగి రెండు సంవత్సరాలు అవుతున్నా తనకు బంగారం పెట్టకపోవడంతో ఇదే విషయం గురించి తన తల్లిదండ్రులను నిలదీసింది.
ఈ క్రమంలోనే మమత తండ్రి.. తన ఆరోగ్యం బాగాలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, కానీ ఆలస్యం అయినా బంగారాన్ని కచ్చితంగా పెడతానని, అందుకు కొంత సమయం కావాలని కోరాడు. దీంతో తమ తల్లిదండ్రులు బంగారం ఇవ్వడం లేదని చెప్పి ఎంతో మనస్థాపానికి గురైన మమత విషపు గుళికలను మింగింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ మమత మృతి చెందిందని.. వైద్యులు తెలిపారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…