ప్రతి రోజూ ఈ సమాజంలో అమ్మాయిలపై జరుగుతున్న అక్రమాలు, దాడులు, అత్యాచారాల గురించి తెలిస్తే ఆడపిల్లలకు జన్మనివాలంటేనే భయం కలుగుతోంది. మనకు స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక ఆడపిల్లకు స్వేచ్ఛ లేకపోవడం ఎంతో దారుణమైన విషయం. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట బాలికలు, మహిళలు, యువతులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. వయస్సుతో తారతమ్యం లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి మృగాళ్లు దారుణంగా ప్రవర్తిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
మండలంలోని పదహారేళ్ల బాలికపై 60 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. సదరు బాలిక రెండు రోజుల క్రితం కిరాణా దుకాణానికి వెళ్లగా అక్కడ ఓ 60 సంవత్సరాల వృద్ధుడు బాలికపై కన్నేసి తన వెంట పడ్డాడు. ఈ క్రమంలోనే తన చెయ్యి పట్టుకుని ఆ బాలికతో ఎంతో అసభ్యంగా ప్రవర్తించి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు.
ఆ వృద్ధుడు తన పట్ల అలా ప్రవర్తించడంతో భయం వేసిన బాలిక ఒక్కసారిగా గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టింది. బాలిక అలా కేకలు వేయడంతో ఆ వృద్ధుడు భయపడి అక్కడినుంచి పరారయ్యాడు. ఈ క్రమంలోనే బాలిక ఇంటికి వెళుతూ తన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను తీసుకుని పోలీస్ స్టేషన్ కు వెళ్లి సదరు వృద్ధుడిపై ఫిర్యాదు చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…