వైద్య పరికరాల తయారీ సంస్థ మెడ్‌ట్రానిక్ హైదరాబాద్‌లోని నానక్ రాం గూడలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్ కేంద్రాన్ని ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ మినిస్టర్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు.బీఎస్‌ఆర్ టెక్‌పార్క్‌లో సుమారు రూ.1,200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేశారు. హెల్త్‌కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసిన యువతకు ఇందులో ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ప్రస్తుతం ఈ కంపెనీ లో వెయ్యి మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించగా భవిష్యత్తులో మరో 4 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ ప్రపంచ స్థాయిలో వైద్య పరికరాల ఇంజనీరింగ్ ఆవిష్కరణ రంగంలో కృషి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ఈ కంపెనీలో దాదాపు లక్ష మందికి పైగా ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు.
2016 లో మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు మెడ్‌ట్రానిక్ కార్యనిర్వాహక చైర్మన్ ఒమర్ ఇస్రాక్‌తో చర్చలు జరిపారు. అనంతరం ఆ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నానక్ రాం గూడలో తమ సంస్థ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావించి ప్రస్తుతం ఆ పనులను పూర్తి చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.