Tees Maar Khan : యంగ్ హీరో ఆది సాయికుమార్ నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈయన ఖాతాలో ఒకటి రెండు తప్ప పెద్దగా హిట్స్ లేవు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీలో ఆది తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నాడు. ఇక త్వరలోనే ఈయన తీస్ మార్ ఖాన్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ క్రమంలోనే ఈ మూవీకి చెందిన టీజర్‌ను కొద్ది సేపటి క్రితమే లాంచ్ చేశారు. ఇందులో యాక్షన్ హీరోగా ఆది అదరగొట్టేశాడు. ఇక ఆదికి జోడిగా సూపర్ గ్లామరస్ భామ పాయల్ రాజ్‌పూత్ నటించింది.
టీజర్‌ను బట్టి చూస్తే సినిమా ఫుల్ యాక్షన్‌తో నిండి ఉంటుందని అర్థమవుతోంది. ఇందులో ఆది పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఇందులో ఆది సరసన బోల్డ్ పాత్రలో పాయల్ రాజ్‌పూత్ కనువిందు చేసింది. టీజర్‌లో కొన్ని సెకన్ల వ్యవధిలోనే అందాల ఆరబోతతో పాయల్ రాజ్‌పూత్ రచ్చ చేసింది. ఇక సినిమాలో ఈమె ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
కాగా ఈ సినిమాను విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తుండగా.. నాటకమ్ ఫేమ్ కల్యాణ్‌జీ గోగన దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీకి గాను చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో ఆది పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కాకుండా ఇంకో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. త్వరలోనే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనుండగా.. సినిమాను వీలైనంత త్వరగా థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీతో అయినా ఆది ట్రాక్ లో పడతాడా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…