Pranitha : సాయి పల్లవి కామెంట్స్ ఏమోగానీ ఆమె చేసిన వ్యాఖ్యలపై ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆమె చేసిన కామెంట్స్‌కు కొందరు మద్దతు తెలుపుతుండగా.. కొందరు మాత్రం ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి సాయి పల్లవి కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. సాయిపల్లవికి అసలు సమాజంలో నెలకొన్న పరిస్థితులు తెలియవని, ఆమెకు తెలియకుండా ఏదీ మాట్లాడొద్దని, సున్నితమైన అంశాలపై స్పందించకపోవడమే మంచిదని.. సాయి పల్లవి నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని.. విజయశాంతి అన్నారు. అయితే ఇప్పుడు నటి ప్రణీత కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఆమె కూడా సాయిపల్లవిపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేసింది. ఇంతకీ సాయి పల్లవి ఏమన్నదంటే..
కాశ్మీర్ పండిట్ల హత్యాకాండను అత్యంత సాధారణంగా పరిగణించే వారి కామెంట్స్ వింటుంటే.. మరోసారి ది కాశ్మీర్ ఫైల్స్ చూడడానికి ఈ కారణం సరిపోతుందని.. వారి బాధను, వారి రోదనను వినాలని.. నటి ప్రణీత ట్వీట్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె సాయిపల్లవి కామెంట్లను ఉద్దేశించే ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే సాయిపల్లవిపై నటి ప్రణీత పరోక్షంగా సెటైర్లు వేసినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ వివాదంలో రోజుకొకరు కలగజేసుకుని మాట్లాడుతున్నారు. కానీ సాయిపల్లవిని నిన్న మొన్నటి వరకు అభిమానించే వారు కూడా ఆమె కామెంట్స్ చేయడంతో ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ కొందరు సెలబ్రిటీలు ఇలాంటి సున్నితమైన అంశాల పట్ల కామెంట్లు చేసి అనవసరంగా వివాదాల్లో చిక్కుకున్నారు. అయినప్పటికీ వారు ఈ విధంగా కామెంట్స్ చేయడం మాత్రం మానడం లేదు.
అయితే ఇదంతా పక్కన పెడితే సాయి పల్లవి నటించిన విరాట పర్వం మూవీ జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ ఫలితం బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇంకో రెండు రోజులు ఆగితేగానీ ఈ మూవీ భవితవ్యం అనేది తేలదు. మరి విరాట పర్వం భవిష్యత్తు ఏమవుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…