Onion Rings : ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల ప్రభావం ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక యాప్‌ల ద్వారా మనకు ఫుడ్ డెలివరీ చేసుకునే సదుపాయం ఏర్పడింది. దీంతో యాప్‌లు పోటాపోటీగా మనకు ఆఫర్లను అందజేస్తున్నాయి. ఇక రెస్టారెంట్లు సైతం భోజన ప్రియులకు అనేక ఆఫర్లను అందిస్తున్నాయి. హోటల్స్‌లో కన్నా యాప్‌ల ద్వారా ఫుడ్‌ను ఆర్డర్ చేస్తేనే మనకు ఆఫర్లు ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో చిన్న చిన్న వంటకాలను కూడా చాలా మంది ఇంట్లో చేసుకోకుండా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడుతున్నారు. అయితే ఇంత వరకు బాగానే ఉంది.. కానీ మనం పెట్టిన ఆర్డర్ తాలూకు ఫుడ్ కాకుండా వేరేది వస్తే ఎలా ఉంటుంది ? అప్పుడు పడే బాధను మాటల్లో చెప్పలేం. అవును.. సరిగ్గా అతనికి కూడా అలాగే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
ఆన్‌లైన్ లో ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో ఓ వ్యక్తి ఫ్రైడ్ ఆనియన్ రింగ్స్ ఆర్డర్ పెట్టాడు. ఉల్లిపాయలను చక్రాల్లా సన్నని రింగుల్లా కట్ చేసి వాటిని నూనెలో వేయించి పకోడీల మాదిరిగా తయారు చేస్తారు. వాటినే ఆనియన్ రింగ్స్ అని పిలుస్తారు. అయితే వీటిని ఆర్డర్ పెడితే వీటికి బదులుగా పచ్చి ఉల్లిపాయలు వచ్చాయి. పచ్చి ఉల్లిపాయలను నీట్‌గా సన్నని రింగుల్లా కట్ చేసి పంపించారు. దీంతో వాటిని చూసి అతను ముందుగా షాకయ్యాడు. అయితే ఆ ఫుడ్ డెలివరీ యాప్‌కు, ఆ రెస్టారెంట్ వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం అతను ఆ ఉల్లిపాయలను ఫొటో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
కాగా ఆ ఫొటోను చూసిన నెటిజన్లు షాకై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఉల్లిపాయల రింగ్స్ ఆర్డర్ చేస్తే వచ్చాయి కదా.. ఇంకెందుకు బాధ అని కొందరు అతన్ని ఆట పట్టిస్తుండగా.. ఇంకొందరు మాత్రం.. ఆ ఫొటోను షేర్ చేసి వారికి తగిన బుద్ధి చెప్పావని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే వాటిని యాప్ నిర్వాహకులు మార్చి మళ్లీ ఆనియన్ రింగ్స్‌ను పంపించారా.. అసలు తరువాత ఏమైంది.. అన్న వివరాలు మాత్రం తెలియలేదు. కానీ ఈ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…