Genelia : ఒకప్పుడు బొమ్మరిల్లు మూవీలో హాసినిగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న జెనీలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పట్లో దాదాపుగా యంగ్ హీరోలు అందరితోనూ ఈమె నటించింది. అయితే 2012లో నా ఇష్టం అనే సినిమాతో ఈమె సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. అనంతరం వివాహం చేసుకుని పిల్లల్ని కని సంతోషంగా జీవితం గడుపుతోంది.
ఇక గతేడాది నిర్వహించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో జెనీలియా సడెన్ గా కనిపించి ఆశ్చర్యపరిచింది. ఈమె అప్పట్లో మంచు విష్ణుతో కనిపించింది. ఆయన ఎన్నికల కోసం ఈమెను ముంబై నుంచి ప్రత్యేకంగా రప్పించారు. ఖర్చులన్నీ ఆయననే భరించారు. అయితే ఆ తరువాత జెనీలియా మళ్లీ కనిపించలేదు. కానీ త్వరలోనే తెలుగు తెరకు గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి హీరోగా వస్తున్న కన్నడ, తెలుగు ద్విభాషా చిత్రంలో జెనీలియా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా ఆమె మళ్లీ టాలీవుడ్‌లో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.
ఇక ఈ మూవీలో జెనీలియా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి సీఈవోగా కనిపించనుంది. ఈ మూవీలో ఈమె పాత్ర కీలకమని తెలుస్తోంది. అందుకనే మళ్లీ ఈమె సినిమాల్లో కనిపించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. ఇక జెనీలియా ఇండస్ట్రీని వదిలి 10 ఏళ్లకు పైగానే అవుతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీతో మరోమారు సినిమాల్లో సందడి చేయనుంది. ఇక ఈ మూవీలో కిరీటికి జోడీగా Pelli SandaD బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.. యాక్షన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ యాక్టర్ రవిచంద్ర మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…