Tees Maar Khan Review : హీరో ఆది సాయికుమార్, పాయల్ రాజ్‌పుత్ కాంబోలో తీస్ మార్ ఖాన్ ఆగస్టు 19న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పటివరకూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్, కామెడీ ఎంటర్టైనర్, థ్రిల్లర్ మూవీలే ఎక్కువగా చేసిన ఆది ఈసారి మాత్రం పక్కా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మూవీతో వచ్చాడు. దర్శకుడు కళ్యాణ్ జీ గోగాన తీస్ మార్ ఖాన్ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ టీజర్, పోస్టర్స్ సినిమాపై మరింత ఆసక్తి పెంచాయి. ఆది సాయి కుమార్ ఈసారైనా తన తీస్ మార్ ఖాన్‌గా ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేది చూద్దాం.
కథ..
తీస్ మార్ ఖాన్ (ఆది సాయికుమార్) అనే ఒక కాలేజ్ స్టూడెంట్ పోలీస్ అవ్వాలి అనుకుంటాడు. ఈ క్రమంలో అనేక సమస్యలు ఎదుర్కొంటాడు. అయితే తీస్ మార్ ఖాన్ తన సోదరుడిని, తన సోదరి భర్తని కోల్పోతాడు. తర్వాత ఏం జరిగింది ? అసలు ఇదంతా ఎవరు చేయిస్తున్నారు ? తీస్ మార్ ఖాన్ తనని ఇంత ఇబ్బంది పెట్టిన వారిపై పగ తీర్చుకుంటాడా ? లేదా.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ..
ఈ సినిమా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ సినిమాలో ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన అంశాలు ఉంటాయి. కథ, కథనం పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. ఆది సాయికుమార్ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. సినిమా మొత్తం ఆది సాయికుమార్, తన సోదరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అనే విషయం మీదే నడుస్తుంది. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పాత్రను చిత్రీకరించిన విధానం కమర్షియల్ సినిమా టెంప్లేట్ హీరోయిన్ పాత్రలాగానే ఉంటుంది. పాటలు కూడా ఏదో సందర్భం లేకుండా వచ్చినట్టు ఉంటాయి. టెక్నికల్ గా సినిమా బాగానే ఉంటుంది. కానీ సినిమాకి ముఖ్యమైన కథ విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్..
నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్..
రొటీన్ కథ, బలహీనమైన కథనం, బోరింగ్ సీన్స్, అవసరం లేకుండా వచ్చే పాటలు
రేటింగ్ : 2.5/5
చివరగా..
టెక్నికల్ గా సినిమా బాగున్నా కూడా కథ విషయంలో కొత్తదనం లోపించింది. కమర్షియల్ సినిమాలని ఎంజాయ్ చేసే వాళ్లకి తీస్ మార్ ఖాన్ ఒక్కసారి చూడగలిగే సినిమా.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…