Viral Photo : ప్రస్తుతం త్రోబ్యాక్ ఫోటోస్ ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో స్టార్ హీరో, హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక తమ అభిమాన నటీనటుల త్రోబ్యాక్ ఫోటోస్ చూస్తూ.. వారిని కనిపెట్టడానికి నెటిజన్స్ కూడా ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో సెలబ్రెటీలు కూడా తమ మధురమైన జ్ఞాపకాలు అంటూ చిన్నప్పటి ఫోటోస్, వీడియోస్ ను అభిమానులతో పంచకుంటున్నారు. అలా.. ఇప్పుడు నెట్టింట్లో సెలబ్రెటీస్ త్రోబ్యాక్ ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ చిన్నారి ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పైన ఫోటోలో బూరెబుగ్గలతో.. అమాయకపు చూపులు.. అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా టాప్ హీరోయిన్ రేసులో దూసుకుపోతోంది. గ్లామర్ పాత్రలైనా.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తూ.. తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. గతేడాది వరుస బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేసింది. ఇప్పటికైనా ఈ చిన్నారి ఎవరో గుర్తొచ్చిందా..
ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు సూపర్ హిట్ అయినా.. ఎందుకో ఆశించనంతగా క్లిక్ కాలేకపోయింది. కానీ ఇటీవల వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్రకారు ఫేవరేట్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది. పైన ఫోటోలో ఉన్న చిన్నారి మరెవరో కాదండోయ్.. ప్రియాంక జవాల్కర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ప్రియాంక. గతేడాది తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణ మండపం, గమనం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది ప్రియాంక.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…