TECNO POVA 5G : మొబైల్స్ తయారీదారు టెక్నో.. పోవా 5జి (POVA 5G) పేరిట ఓ నూతన 5జి స్మార్ట్ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ కంపెనీకి చెందిన తొలి 5జి ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో అనేక ఆకట్టుకునే అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం.
టెక్నో పోవా 5జి స్మార్ట్ ఫోన్‌లో 6.9 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన భారీ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్‌ప్లే క్వాలిటీగా ఉంటుంది. ఇక ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఇది 5జి కి సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌ను అందిస్తున్నారు. అవసరం అయితే మరో 3జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా పెంచుకోవచ్చు. ఇక 128 జీబీ స్టోరేజ్ దీంట్లో ఉంది. మెమొరీని కార్డు ద్వారా మరో 512 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు.

ఈ ఫోన్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను వెనుక భాగంలో అందిస్తున్నారు. దీనికి తోడు మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరా కూడా ఉంది. అలాగే 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఇందులో లభిస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్‌బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.
ఈ ఫోన్‌లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్ లభిస్తుంది. కనుక ఈ ఫోన్ 33 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
టెక్నో పోవా 5జి స్మార్ట్ ఫోన్ ఏథర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లోనే విడుదలైంది. ఈ ఫోన్ ధర రూ.19,999 ఉండగా.. దీన్ని అమెజాన్‌లో విక్రయిస్తున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. ఇక దీన్ని కొనుగోలు చేసిన మొదటి 1500 మందికి రూ.1,999 విలువైన ఉచిత పవర్ బ్యాంక్‌ను అందించనున్నారు.