Meenakshi Chaudhary : మాస్ మహారాజా రవితేజ హీరోగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతిలు హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ఖిలాడి. ఈ మూవీ ఈనెల 11వ తేదీన విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజ డ్యుయల్ షేడ్స్‌లో నటించినట్లు సినిమా ట్రైలర్‌ను చూస్తే తెలుస్తుంది. ఇక ఈ మూవీలో ఒక హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బోల్డ్ కామెంట్స్ చేసింది.
రవితేజ లాంటి స్టార్ నటుడి పక్కన నటించాలని ఆఫర్ వస్తే ఎవరు వదులుకుంటారు, నేను అందుకనే వెంటనే మారుమాట్లాడకుండా ఓకే చెప్పేశా. నా రెండో మూవీగా ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. సినిమా ఆరంభంలో కొన్ని ఇంటిమేట్ సీన్లు ఉంటాయి. దర్శకుడు రమేష్ వర్మ నాకు ఆ సీన్ల గురించి ముందుగానే చెప్పారు. కథ విన్నప్పుడే ఆయన ఆ సీన్లు ఉంటాయన్నారు. అయితే కమర్షియల్ సినిమాలకు ఇలాంటి విషయాలు తప్పనిసరి అని నాకు తెలుసు. అందుకనే ముద్దు సీన్లలో నటించేందుకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.. అని మీనాక్షి చౌదరి తెలియజేసింది.

ఇక ఇందులో ఇంకో హీరోయిన్‌గా నటించిన డింపుల్ హయతి ఇది వరకే పలు మూవీల్లో ఐటమ్ సాంగ్‌లు చేసింది. గద్దలకొండ గణేష్‌లో ఆమె ఐటమ్ సాంగ్‌లో నటించి మెప్పించింది. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు ఐటమ్ సాంగ్స్ చేయమని ఆఫర్స్ వచ్చాయి, అయితే నాకు హీరోయిన్‌గా నటించాలని ఉంది, అందుకనే వాటికి నో చెప్పా. చివరకు రవితేజ సినిమాలో చాన్స్ వచ్చింది. ఇది నాకు చాలా ప్రత్యేకమైన పాత్ర.. అని చెప్పింది.