Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈమధ్య కాలంలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. ఈ అమ్మడు ఇటీవల నటించిన ఎఫ్3 మూవీ విడుదల కాగా.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో ఎక్కడా ఈమె పాల్గొనలేదు. కనీసం సోషల్ మీడియాలో అయినా సరే పోస్ట్ పెట్టలేదు. దీంతో తమన్నాకు, చిత్ర యూనిట్‌కు మధ్య ఏదో జరిగిందని.. వారితో గొడవ కారణంగానే తమన్నా ఎఫ్3 మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొనడం లేదని వార్తలు వచ్చాయి. అయితే ఆమె కేన్స్ ఉత్సవంలో ఉన్నందునే మూవీ ప్రమోషన్స్ చేయడం లేదని కొందరు అన్నారు. కానీ విషయం వేరే ఉందని చర్చించుకుంటున్నారు.
ఇక కేన్స్ ఉత్సవం మే 28వ తేదీతో ముగిసింది. దీంతో తమన్నా తిరిగి ఇండియాకు వచ్చింది. అయితే ఆశ్చర్యకరంగా ఆమె ఎఫ్3 మూవీ గురించి పోస్ట్ పెట్టింది. ఎఫ్3 సినిమాలో తమన్నా సెకండాఫ్‌లో మగ వేషం వేసి నటించిన విషయం తెలిసిందే. అయితే అదే గెటప్‌లో తమన్నా మరోమారు సందడి చేసింది. ఓ వీడియోను షేర్ చేసిన ఆమె అందులో అమ్మాయిగా ఉండి వెంటనే అబ్బాయిగా మారింది. ఆ అబ్బాయి గెటప్ ఎఫ్3 మూవీలోనిది కావడం విశేషం.

ఎఫ్3 మూవీలో అబ్బాయిగా మారిన తమన్నాతో సోనాల్ చౌహాన్ లవ్‌లో పడుతుంది. అయితే చివరకు నిజం తెలుసుకుని షాకవుతుంది. ఈ కామెడీ ట్రాక్‌ను మూవీలో బాగా చూపించారు. అయితే మూవీకి ప్రమోషన్స్ చేయలేదనుకుందో.. ఏమో.. గానీ తమన్నా మాత్రం ఎట్టకేలకు ఈ మూవీ గురించి అయితే ఒక పోస్ట్ మాత్రం పెట్టింది. అందులో అమ్మాయిగా ఉన్న తమన్నా.. అబ్బాయిగా మారింది. ఆ గెటప్ ఎఫ్3 మూవీలో ఆమె వేసిందే కావడం విశేషం. కాగా తమన్నాకు చెందిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#tamannaah #viralvideo pic.twitter.com/LDpzuXGfsr
— India Daily Live (@IndiaDailyLive) June 1, 2022