Naga Chaitanya : లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల విజయాలతో నాగచైతన్య మంచి జోరు మీద ఉన్నాడు. ఈయన నటించిన లాల్ సింగ్ చడ్డా అనే హిందీ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇక మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన థాంక్ యూ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీ కూడా త్వరలోనే విడుదల కానుంది. అయితే ప్రస్తుతం చైతూ ఇంకో సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది. డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ చెప్పిన స్టోరీ చైతూకు బాగా నచ్చిందట. దీంతో ఆ సినిమాను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
డీజే టిల్లు మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇందులో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. ఈమూవీ ఎలాంటి అంచనాలు లేకుండానే విడుదలై భారీగా కలెక్షన్లను వసూలు చేసింది. బంపర్ హిట్ అయింది. మూవీకి చెందిన టీజర్, ట్రైలర్ చూసి ఇందులో ఆ తరహా సీన్లు ఉంటాయని అనుకున్నారు. కానీ అలా కాకుండా కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్రం సాగింది. ముఖ్యంగా ఇందులో డీజే టిల్లు పాత్ర చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ డైలాగ్స్‌పై ఇప్పటికీ మీమ్స్ చేస్తూనే ఉన్నారు.

అయితే డీజే టిల్లులో సిద్ధు పాత్రను డిజైన్ చేసినట్లుగానే చైతన్యతో తీయబోయే మూవీలో విమల్ కృష్ణ చైతూ పాత్రను కూడా అలాగే డిజైన్ చేయనున్నారట. ఊర మాస్ క్యారెక్టర్‌తో.. తెలంగాణ యాసతో చైతూ క్యారెక్టర్ ఉంటుందట. ఇక డీజే టిల్లుకు భిన్నంగా స్టోరీ ఉంటుందని.. కానీ చైతూ క్యారెక్టర్ మాత్రం డీజే టిల్లును తలపిస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
ఇక చైతన్య ప్రస్తుతం సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. వాస్తవానికి సర్కారు వారి పాట కన్నా ముందే చైతన్యతో పరశురామ్ మూవీ చేయాల్సి ఉంది. కానీ మహేష్ సినిమా కావడంతో ముందుగా దాన్ని కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు చైతూను పరశురామ్ డైరెక్ట్ చేయనున్నారు. ఈ మూవీ అయ్యాకే.. విమల్ కృష్ణతో మూవీ ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.