Tamanna : మిల్కీ బ్యూటీ తమన్నా శరీరంలో ఇటీవల పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం తమన్నా కరోనాను జయించింది. ఆమె తనకు కరోనా నిర్థారణ అయిన వెంటనే ప్రముఖ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ కు జాయిన్ అయ్యిందట. ఆ సమయంలో ఆమె తీసుకున్న ట్రీట్ మెంట్ చాలా కఠినంగా ఉండేదట. ఒకానొక సమయంలో తాను చనిపోతాననే భయం కూడా కలిగిందట. అయితే కరోనా నుండి కోలుకున్న తర్వాత తమన్నా కొంత లావు అయింది. మందులు, డైట్ వల్ల కాస్త బరువు పెరగడంతో అందరూ.. లావు అయ్యావు కదా.. అంటూ ట్రోల్స్ చేశారు. ఆ సమయంలో కాస్త ఫీల్ అయింది.

అయితే గత కొద్ది రోజులుగా తమన్నా నిత్యం జిమ్ వర్కవుట్స్, యోగా చేస్తోంది. వాటికి సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు రాగా, అవి చూసిన నెటిజన్స్ స్టన్ అవుతున్నారు. అయితే తాజాగా తమన్నా తన సోషల్ మీడియాలో వర్కవుట్స్‌కి సంబంధించిన పిక్ షేర్ చేయగా.. దానికి.. మీ దగ్గర ఉంది, దాచవద్దు అంటూ కామెంట్ పెట్టింది. దీనికి కొంతమంది నెటిజన్లు ఆమె బరువు పెరగడం వల్లే ఈ క్యాప్షన్ రాసిందని అంటున్నారు. అయితే ఇటీవల తమన్నా మళ్లీ బరువు పెరిగినట్టు కనిపిస్తుందని, దానిని తగ్గించేందుకు వర్కవుట్స్ మొదలు పెట్టిందని చెబుతున్నారు.
తమన్నా రీసెంట్‌గా గని సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఐటమ్ సాంగ్‌తో అలరించింది. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 3 చిత్రంలో తమన్నా కథానాయికగా నటించగా, ఈ చిత్రం మే 27న విడుదల అవుతోంది. నాగశేఖర్ రొమాంటిక్ చిత్రం గుర్తుందా శీతాకాలంలో సత్యదేవ్ సరసన కూడా ఆమె కథానాయికగా నటిస్తోంది. ఆమె పలు హిందీ సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది.