Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత తగ్గేదే లే అంటోంది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటోంది. సినిమాలు, ఐటమ్ సాంగ్స్, యాడ్స్.. ఇలా ప్రతీదీ.. తనకు అనుకూలంగా మలచుకుంటోంది. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా క్రేజ్ పొందిన సమంత పుష్ప సాంగ్‌లో ఊ అంటావా ఊఊ అంటావా అనే పాటకు చిందులేసి తన క్రేజ్ రెట్టింపు చేసుకుంది. ఈ సాంగ్ తర్వాత సమంతకు ఇలాంటి ఆఫర్స్ చాలానే వస్తున్నాయి. సమంత నటిస్తున్న తమిళ చిత్రం కాతు వాకుల రెండు కాదల్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ఇందులో నయనతార, విజయ్ సేతుపతిలతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే.

విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాతు వాకుల రెండు కాదల్ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ థియేటర్లలోకి రానుంది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసి కడుపుబ్బా నవ్వుతారని హామీ ఇచ్చింది సమంత. ఈ రోమ్-కామ్ మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా చిత్రబృందం కేక్ కోసిన పిక్స్ ను సామ్ షేర్ చేసుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని కన్మణి రాంబో ఖతీజా పేరుతో విడుదల చేయబోతున్నారు.
అయితే ఈ చిత్రం ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న నేపథ్యంలో ఈ సినిమాలోని టూ టూ టూ అనే పాట సమంత నుండి వచ్చే స్పైసియస్ట్ ట్రీట్‌గా ఉండబోతోందని పుకార్లు పుట్టుకొస్తున్నాయి. పింక్ దుస్తులు ధరించి, డీప్ నెక్‌లైన్ తో ఉన్న సమంత ఫొటోలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఇది స్పెషల్ సాంగ్ కి సంబంధించిన పోస్టర్ అని అంటున్నారు.
ఊ అంటావా తర్వాత సమంత నుండి రాబోతున్న మరో ఐటమ్ సాంగ్ ఇది అని కొందరు చెప్పుకొస్తున్నారు. కాగా సమంత ప్రస్తుతం దర్శక ద్వయం హరి అండ్ హరీష్ దర్శకత్వం వహిస్తున్న పాన్-ఇండియన్ థ్రిల్లర్ యశోద షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు సామ్ గుణశేఖర్ పౌరాణిక చిత్రం శాకుంతలం, హాలీవుడ్ చిత్రం అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్, రస్సో బ్రదర్స్ సిటాడెల్ వంటి చిత్రాలలో కూడా కనిపించనుంది.