Blood Sugar Levels : ప్రస్తుతకాలంలో అత్యధికంగా పీడిస్తున్న వ్యాధి మధుమేహం. ఏడాది పొడవునా ప్రతి సీజన్‌లోనూ మధుమేహ వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య విషయంలోనూ, తీసుకునే ఆహారం విషయంలోనూ ఎంతో జాగ్రత్త వహించాలి. మీరు తీసుకునే ఆహారమే మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపిస్తుంది. ఆహారంలో నిత్యం పోషకాలను తీసుకోవడం వలన రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణంలో ఉంటాయి.
డయాబెటిస్ పేషెంట్స్ రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఖనిజాలు, అధిక ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు, ప్రోటీన్స్, ఉండేలా తీసుకోవటం ఉత్తమం. అయితే డయాబెటిస్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను దూరం పెట్టడం మంచిది. కొన్ని కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారం కారణంగా మందులతో నయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
డయాబెటిస్ ఉన్న వారు చక్కెర అధికంగా ఉండే పండ్లను అసలు తీసుకోకూడదు. డయాబెటిస్ ఉన్నవారు బాగా ఎక్కువ మొత్తంలో పుచ్చకాయలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఐస్ క్రీం, స్వీట్స్ తీసుకోకూడదు. ఒకవేళ డయాబెటిస్ పేషెంట్స్ పండు తినాలంటే చాలా మితంగా వాటిని తీసుకొనాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక అరటి పండు తినాలి అనిపిస్తే దానిలో సగభాగం మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
మామిడి, ఖర్బూజా, ద్రాక్షా, సీతాఫలాలు, పైనాపిల్ వంటి వాటిలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. అందువలన ఈ పండ్లకు దూరంగా ఉండాలి. నూనెలో వేయించిన పదార్థాలు మరియు వండిన ఎర్ర మాంసం, చికెన్ తింటే డయాబెటిస్ పేషెంట్లలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బార్బెక్యూయింగ్, బ్రాయిలింగ్, గ్రిల్లింగ్, వేయించే పద్దతుల్లో వండిన మాంసం తింటే ఈ ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువగా పీచు మరియు మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. నిత్యజీవితంలో షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే శరీరానికి మంచి పోషకాలు ఇవ్వడం ఎంతో అవసరం. రాగులు, సజ్జలు, అవిసెలు, ఊదలు, సామలు వంటి చిరుధాన్యాలను ఆహారంలో నిత్యం తీసుకోవాలి. చిరుధాన్యాలను అధికంగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెజబ్బులు, డయాబెటిస్, రొమ్ము క్యాన్సర్ లను దరిచేరనివ్వవు. స్త్రీలల్లో వచ్చే మెనోపాజ్ సమస్యలను కూడా అదుపు చేస్తాయి. కనుక చిరు ధాన్యాలను ఎక్కువగా తింటే డయాబెటిస్ తగ్గడంతోపాటు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…