Yashoda Movie : టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాలు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో సమంత నటిస్తున్న యశోద చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మూవీపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తోండగా.. హరి – హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లో సమంత గర్భవతి పాత్రలో కనిపించింది. టీజర్ లో డాక్టర్ సమంతను గర్భవతిగా ఉన్నప్పుడు ఏ ఏ పనులైతే చేయకూడదని చెప్తుందో సమంత అలాంటి పనులే చేస్తుంది. ఆమెను ఎవరో చంపడానికి ప్రయత్నించడం.. వాళ్ళ నుంచి సామ్ తప్పించుకోవడం.. విలన్స్ తో పోరాడటం ఈ టీజర్ లో చూపించారు. అసలు సమంతకు ఏమైంది.? ఆమెను ఎందుకు చంపాలని ప్రయత్నిస్తున్నారు..? అనేది ఆసక్తికరంగా ఉంది. అయితే ఈ సినిమా కోసం సమంత తీసుకున్న రెమ్యునరేషన్ కి సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
యశోద సినిమా కోసం సామ్ కేవలం 50 రోజుల కాల్‌షీట్స్ మాత్రమే ఇచ్చినట్టు సమాచారం. ఇలా అతి తక్కువ కాల్‌షీట్స్ ఇచ్చినా రెమ్యూనరేషన్ మాత్రం భారీగా తీసుకుందని తెలుస్తోంది. సమంత యశోద సినిమా కోసం దాదాపు రూ.2.75 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఏకకాలంలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. యశోద టీజర్ తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. త్వరలో మేకర్స్ ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…