Ginger Juice : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే అల్లాన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని తరచూ వంటల్లో పేస్ట్‌లా చేసి వేస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద పరంగా అల్లం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ అల్లం రసం సేవిస్తే మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. దీంతో అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇక అల్లం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లం రసాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్ మోతాదులో సేవించడం వల్ల జీర్ణ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపులో మంట, అజీర్ణం, వికారం, వాంతులు నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే దంతాలు, చిగుళ్ల నొప్పులు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. సీజనల్‌గా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లంలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు మనల్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు అల్లం జ్యూస్ ని తీసుకుంటే ఆకలిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ సమయంలో మీ క్యాలరీలు ఎక్కువగా ఖర్చు కావడానికి అల్లం తోడ్పడుతుంది.కండరాల నొప్పులకు కూడా అల్లం మంచి మందులా పని చేస్తుంది. వ్యాయాయం వల్ల కలిగే కండరాల నొప్పులను అల్లం తగ్గిస్తుంది. అయితే ఇది వెంటనే ఫలితాన్ని చూపించదు. నెమ్మది నెమ్మదిగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు అల్లం కీళ్ళ నొప్పులను, ఆర్థరైటిస్ నొప్పులను కూడా తగ్గిస్తుంది.
అంతేకాకుండా బ్లడ్ షుగర్ ను నియంత్రిస్తుంది. మధుమేహం ఉన్న వాళ్ళు తప్పకుండా అల్లం తీసుకోవాలి. అల్లం రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుందని ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది. అలాగే మధుమేహం రోగుల ఇన్సులిన్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు అల్లం ఉపయోగపడుతుంది. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు అల్లాన్ని డైట్ లో తీసుకోవాలనుకుంటే వైద్యుల సూచనలను తీసుకోవడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…