Garlic : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎటువంటి పని చేయకపోయినా, ఎటువంటి అనారోగ్య సమస్య లేకపోయినా తరచూ అలసటకు గురి అవుతున్నారు. తరచూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. దీనికి కారణం మన శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల మనం అనేక రోగాల బారిన పడాల్సి వస్తోంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి మనల్ని రోగాల బారిన పడకుండా చేయడంలో వెల్లుల్లి మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని మనం తరుచూ వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాం. దీనిని వాడడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. వెల్లుల్లి మన ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిపుణులు అంటున్నారు.
రోజూ పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బను తినడం వల్ల మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లి ఘాటైన రుచిని, వాసనను కలిగి ఉంటుంది. దీనిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా చేయడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుంది. చాలా మంది దీని వాసన, రుచి కారణంగా దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే దీనిని తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి ఘాటుగా ఉంటుంది కనుక దీనిని మనం నేరుగా తినలేం. కనుక వెల్లుల్లిని, తేనెను కలిపి తినడం వల్ల రుచి మెరుగుపడడమే కాకుండా శరీరానికి కూడా మేలు కలుగుతుంది. రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లిని, తేనెను కలిపి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రెండింటినీ క్రమం తప్పకుండా వారం రోజుల పాటు తీసుకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా పేస్ట్ గా చేసి ఆ మిశ్రమానికి రెండు టీ స్పూన్ల తేనెను కలిపి రోజూ క్రమం తప్పకుండా వారం రోజుల పాటు తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోవడం వల్ల రక్త నాళాలలో రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, గొంతులో ఇన్ ఫెక్షన్ లు తగ్గుతాయి. శరీరంలో వాపులు, నొప్పలు కూడా తగ్గుతాయి. జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. వెల్లుల్లిని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల జలుబు, ఫ్లూ వంటి ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. శరీరంలో ఉండే మలినాలు కూడా తొలగిపోతాయి. అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో కొవ్వు స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా రోజూ పరగడుపున వెల్లుల్లిని, తేనెను కలిపి తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…