Lissy : సినిమా ఇండస్ట్రీలో కొందరు మాత్రం దీర్ఘకాలం పాటు హీరోయిన్స్‌గా కొనసాగుతారు. కానీ కొందరు ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరమవుతారు. అయితే ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇలా ఒకటి రెండు సినిమాల్లో నటించి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారిలో లిజి ఒకరు. ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రేక్షకులకు ఈమె గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఈమె తెలుగులో కేవలం 8 సినిమాలను మాత్రమే చేసింది. తరువాత ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.
లిజి చేసిన సినిమాల్లో రెండు మూడు మాత్రమే హిట్ అయ్యాయి. ఈమె 2 ఏళ్ల పాటు అప్పట్లో తెలుగు తెరపై మెరిసింది. తరువాత సినిమాలకు దూరమైంది. కేరళలో పుట్టి పెరిగిన లిజి చిన్నప్పుడే పేరెంట్స్ విడిపోవడంతో తల్లి దగ్గరే పెరిగి పెద్దదైంది. 16 ఏళ్ల వయస్సులో ఇంటర్ చదువుతుండగా మళయాళ మూవీలో చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏడాదికి 20సినిమాలు చేసే స్థాయికి ఎదిగి విపరీతంగా పాపులార్టీ సంపాదించింది. రాజేంద్ర ప్రసాద్ తో సాక్షి మూవీలో నటించి టాలీవుడ్ కి 1989లో ఎంట్రీ ఇచ్చింది. 1991వరకూ మాత్రమే లిజి ఇక్కడ పనిచేసింది.
సుమన్ హీరోగా వచ్చిన 20వ శతాబ్దం, దోషి నిర్దోషి, ఆత్మబంధం అనే మూవీస్ లో లిజి హీరోయిన్ గా చేసింది. భానుచందర్ తో స్టూవర్టుపురం దొంగలు, రాజశేఖర్ నటించిన మగాడు మూవీ తో పాటు మామశ్రీ లో కూడా లిజి నటించింది. 1990లో డైరెక్టర్ ప్రియదర్శన్ ప్రేమలో పడిన ఈమె మొత్తానికి పెళ్లిచేసుకుంది. అప్పటికే ఒప్పుకున్న సినిమాలు పూర్తిచేసి ఫ్యామిలీకి అంకితం అయ్యింది. తెలుగులో తక్కువ చేసినా మళయంలో 100 సినిమాలు చేసింది. ఇక తెలుగులో ఎన్ని ఆఫర్స్ వచ్చినా సరే సినిమాలకు దూరంగానే ఉంటోంది. ఇక ఈమె అప్పుడప్పుడు బయట కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈమె లేటెస్ట్ ఫొటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…