Tabu : కూలీ నెం 1 చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైంది టబు. ఈ మూవీ తరువాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. నిన్నే పెళ్లాడుతా మూవీలో మహాలక్ష్మీ క్యారెక్టర్ ని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు లేరేమో అనిపించేలా అందం, అభినయంతో ఆకట్టుకుంది టబు. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన అమ్మడు బాలీవుడ్ లో ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అనుభవిస్తూనే ఉంది. ఇటీవలే తెలుగులో అల వైకుంఠపురం చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన టబు ప్రస్తుతం హిందీలో కార్తీ ఖైదీ చిత్రం రీమేక్ భోళాలో నటిస్తోంది.
ప్రస్తుతం టబు వయసు 50 ఏళ్ళు. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అయితే ఆ మధ్య ఓ టాలీవుడ్ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని టాక్ గట్టిగా వినిపించింది. అయితే ఆ వార్తలపై టబు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఆమె ఏ ఇంటర్వ్యూకి వెళ్లిన పెళ్లి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. అయితే తాజాగా తన పెళ్లి ప్రశ్నకు ఆమె కొద్దిగా ఘాటుగానే స్పందించింది. ఇప్పుడు టబు మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మీరు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.. ఆ విషయం గురించి ఎందుకు ఆలోచించలేదు.. మీకు అమ్మ అని పిలిపించుకోవాలని లేదా..? అని ప్రశ్నించాడు హోస్ట్.
దానికి టబు సమాధానం ఇస్తూ.. తల్లి అవ్వాలనుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అని షాక్ ఇచ్చింది. పెళ్ళి కాకుండానే తల్లికావచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లి అయ్యే అవకాశం ఉంది. నేను కావాలంటే అలా కూడా చేస్తా.. నన్ను ఎవరూ ఆపరు. అయినా పెళ్లి కాకపోయినా.. పిల్లల్ని కనకపోయినా చచ్చిపోతామా అని టబు ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం యాక్టింగ్ కెరీర్ ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. టబు వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…