Sushanth : సోషల్ మీడియా లేని రోజుల్లో హీరోలు, హీరోయిన్లు ఏదైనా పత్రికకో లేదా చానల్‌కో ఇచ్చే ఇంటర్వ్యూలనే ఎక్కువగా ప్రేక్షకులు చూసే వాళ్లు. ఇంటర్వ్యూలలో జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు వారు చెప్పే సమాధానాలు తెలుసుకుని అక్కడి వరకే ప్రేక్షకులు సంతృప్తి పడేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక.. అలాంటి ఇంటర్వ్యూలతో పనిలేకుండా పోయింది. తమ అభిమాన హీరో లేదా హీరోయిన్‌లను ఫ్యాన్సే నేరుగా ప్రశ్నలు అడుగుతున్నాడు. అయితే నెటిజన్లు సరిగ్గా ప్రశ్నలు అడిగి అందుకు సెలబ్రిటీలు సరిగ్గా జవాబులు చెబితే ఓకే. లేదంటే ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో నెటిజన్లు వింతైన ప్రశ్నలు అడుగుతుంటారు. దీంతో అలాంటి ప్రశ్నలకు సెలబ్రిటీలు చెప్పే సమాధానాలు వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా నటుడు సుశాంత్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఓ నెటిజన్ సుశాంత్‌ను చాలా దారుణంగా ఓ మాట అడిగేశాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
నటుడు సుశాంత్ ఇటీవల తన సోషల్ ఖాతాలో లైవ్ నిర్వహించాడు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. అయితే ఓ నెటిజన్ మాత్రం నువ్వు ఇంకా వర్జిన్‌వేనా.. అని సుశాంత్‌ను అడిగేశాడు. అయితే దీనికి సుశాంత్ తడుముకోకుండా.. నిప్పు సింబల్‌ను చూపించాడు. అంటే.. తాను ఇంకా నిప్పునేనని, తన శీలం పదిలంగానే ఉందని ఆయన అలా సింబాలిక్‌గా చెప్పారన్నమాట. అంటే ఆయన ఇంకా వర్జినే అన్న విషయం స్పష్టమైంది.
ఇక ఇంకో నెటిజన్ మీ పెళ్లి తేదీ ఎప్పుడు అని అడగ్గా.. ఇంకా అమ్మాయినే వెతుక్కోలేదు. అప్పుడే పెళ్లి తేదీ ఎలా చెప్పగలను.. అంటూ సుశాంత్ సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన ఇచ్చిన రిప్లైస్ అదిరిపోయేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మళ్లీ బన్నీతో ఎప్పుడు కలసి నటిస్తారు.. అని అడగ్గా.. చాన్స్ వస్తే అల వైకుంఠపురములో సెకండ్ పార్ట్‌లో నటిస్తానని.. అయితే దీనిపై బన్నీని కూడా అడగాలని సుశాంత్ చెప్పారు. సుశాంత్ అల వైకుంఠ పురములో సినిమాలో ఓ కీలకపాత్రలో నటించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే సుశాంత్ నేరుగా చేస్తున్న చిత్రాలు ఏవీ హిట్ కావడం లేదు. దీంతో ఆయన ఇతర హీరోల సినిమాల్లో నటిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…