Singer Chinmayi : తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కేవలం సింగర్ కానే కాదు.. సమాజంలోని ఘటనలపై స్పందించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈమె మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వారిపై చూపించే వివక్ష, ఇతర మహిళల సమస్యలపై పోరాటం చేస్తుంటుంది. తన సోషల్ మీడియా ఖాతాల వేదికగా ఈమె మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తుంటుంది. దీంతో ఈమెకు చాలా మంది మహిళలు తమ గోడు చెప్పుకుంటుంటారు. ఇక అలాగే ఇటీవలే ఓ యువతి తన గోడును చిన్మయికి తెలియజేసింది. దీంతో చిన్మయి ఆగ్రహం పట్టలేకపోయింది. ఈ క్రమంలోనే ఆ యువతి ఎవరు, వివరాలు ఏమిటి.. అన్న విషయాలను వెల్లడించకుండా.. ఆమెకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించింది. అయితే అసలు ఏం జరిగింది.. అంటే..
సింగర్ చిన్మయికి ఇటీవలే ఓ యువతి తన బాధను చెప్పుకుంది. తనకు 19 ఏళ్లు అని.. 16 ఏళ్లు ఉన్న తన తమ్ముడు తనను ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినట్లు తాకుతున్నాడని.. అయితే ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబితే వారు.. వాడు ఇప్పుడే ఎదుగుతున్నాడు, యవ్వనంలోకి వస్తున్నాడు, అందుకనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, వాళ్లు అలాగే చేస్తారు, నువ్వే నీ శరీరాన్ని సరిగ్గా దాచుకోవడం లేదు, కనుక అది నీ తప్పే.. అని ఆ యువతిని ఆమె తల్లిదండ్రులు నానా మాటలు అన్నారు. ఇక ఇదే విషయాన్ని ఆ యువతి సింగర్ చిన్మయికి చెప్పుకుని బాధపడింది. తల్లిదండ్రులే అలా అంటే ఇంక చేసేదేముంటుంది.. వెంటనే ఇంట్లో నుంచి వెళ్లిపోదామని అనుకున్నా.. కానీ నా వయస్సు 19 ఏళ్లు అని ఆగాను.. అని ఆ యువతి చెప్పిందని.. సింగర్ చిన్మయి తెలియజేసింది.
ఈ సందర్భంగా సింగర్ చిన్మయి ఆ యువతి తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీకు అమ్మాయిలు అంటే ఎందుకంత ద్వేషం.. అని ఆమె ప్రశ్నించింది. కాగా చిన్మయి పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే చిన్మయికి ఇలా చాలా మంది మహిళలు, యువతులు తమ సమస్యలను చెప్పుకుంటుంటారు. నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే మేము ఇంకా జీవిస్తున్నాం.. అని మహిళలు ఆమెకు మెసేజ్‌లు పెడుతుంటారు. అయితే చిన్మయి ఇలా పోస్ట్ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఉన్నట్లుండి ఇలా ఈ పోస్ట్‌తో ఆమె మళ్లీ వార్తల్లో నిలిచింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…