Nandamuri Mokshagna : దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్3 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసే దిశగా దూసుకుపోతోంది. ఇందులో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సునీల్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ హిట్ అయినప్పటికీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరిన్ని కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంది. అయితే దీన్ని కూడా ఎఫ్3 మూవీ సాధిస్తుందని చిత్ర యూనిట్ ధీమాను వ్యక్తం చేస్తోంది. ఇక ఈ మూవీ మేకర్స్ కూడా ప్రస్తుతం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మునిగి తేలుతున్నారు.
ఇక దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3 సక్సెస్ సందర్భంగా మీడియా సంస్థలకు మళ్లీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయనను మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీపై ప్రశ్నించారు. మోక్షజ్ఞ తొలి సినిమాను మీరు డైరెక్ట్ చేస్తున్నారట కదా.. దాని గురించి చెప్పండి అని అడిగితే.. ప్రస్తుతానికి అలాంటిదేమీ లేదని.. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. తాను మోక్షజ్ఞను డైరెక్ట్ చేయడం లేదని.. బాలకృష్ణ ఈ విషయంపై తనను సంప్రదించలేదని అన్నారు. అయితే బాలకృష్ణతో సినిమా చేయనున్న విషయాన్ని మాత్రం అనిల్ రావిపూడి కన్‌ఫామ్ చేశారు.
ప్రస్తుతానికి మోక్షజ్ఞతో సినిమా చేయడం లేదు.. కానీ బాలకృష్ణతో సినిమా చేస్తున్నా.. ఆయనను వెండితెరపై ఎలా చూపించాలి.. అన్న దానిపై వర్క్ చేస్తున్నా.. అంతేకానీ ఆయన తన తనయుడు మోక్షజ్ఞ మూవీపై ఇంకా నాతో ఏమీ మాట్లాడలేదు. అవన్నీ పుకార్లే.. అని అనిల్ రావిపూడి అన్నారు. దీంతో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇప్పట్లో లేదని తేలిపోయింది. అయితే ఈ మధ్యే దీనిపై ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని అనిల్ చెప్పేశారు. దీంతో మళ్లీ ఈ విషయం కొద్ది రోజుల పాటు తెరమరుగు కానుంది. ఇక మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ విషయమై నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…