Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ క్వీన్‌గా పేరు గాంచిన కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సినిమాల కన్నా తన పోస్టులు, కామెంట్లతోనే వార్తల్లో ఎక్కువగా నిలుస్తుంటుంది. ఈమధ్యే ధాకడ్ అనే సినిమాతో ఈమె ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ మూవీ అత్యంత డిజాస్టర్‌గా మిగిలింది. రూ.100 కోట్లు పెట్టి సినిమాను తీస్తే.. వచ్చింది రూ.3 కోట్లే. దీంతో ఈ మూవీ వల్ల బాలీవుడ్‌కు పెద్ద అవమానమే జరిగిందని ప్రముఖులు అంటున్నారు. ఈ మూవీ 3వ రోజు థియేటర్లలో అసలు ప్రదర్శితం కాలేదు. వేరే సినిమాలను ప్రదర్శించారు. ఇక ఓటీటీలో అయినా రిలీజ్ చేద్దామని చూస్తే.. ఎవరూ ఈ మూవీని కొనేందుకు ఆసక్తిని చూపించలేదు. దీంతో కంగనా రనౌత్ కెరీర్‌లోనే అత్యంత దారుణమైన పరాభవాన్ని ధాకడ్ మూవీ మూటగట్టుకుందని చెప్పవచ్చు. అయితే ఈ మూవీనే కాదు.. దీనికి ముందు తీసిన సినిమాలు కూడా పెద్దగా ఏమీ ఆడలేదు. దీంతో కంగనా భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అంటున్నారు.
కంగనా రనౌత్ తెల్లారి లేస్తే బాలీవుడ్‌పై దుమ్మెత్తిపోస్తుంటుంది. అప్పట్లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య విషయంలో కంగనా స్పందిస్తూ.. బాలీవుడ్‌లో ఉన్న బంధుప్రీతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అలాంటి కామెంట్లను ఈమె అడపా దడపా చేస్తూనే వస్తోంది. కానీ సరైన చాన్స్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ధాకడ్ వల్ల ఆ చాన్స్ రానే వచ్చింది. దీంతో కంగనాను ఇప్పుడు వారు ఆడుకుంటున్నారు. గతంలో ఈమె వల్ల తిట్లు పడిన వారందరూ ఈమెను ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చీవాట్లు పెడుతున్నారు. ఈమె నటిస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని.. ఇక ఈమెకు భవిష్యత్తు లేదని అంటున్నారు.
అయితే మొన్నీ మధ్యే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కంగనా.. తాను హోస్ట్ చేస్తున్న లాకప్ షో మాత్రం హిట్ అయిందని.. త్వరలోనే మళ్లీ బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. అయితే నిజంగానే ఆమె చెప్పినట్లు తరువాత ఆమె చేయనున్న సినిమాతో హిట్ కొడుతుందా.. లేదా.. అన్నది చూడాలి. ఒక వేళ ఆమె నెక్ట్స్ సినిమా కూడా హిట్ కాకపోతే.. అప్పుడు బాలీవుడ్‌లో ఆమె కెరీర్ క్లోజ్ అయినట్లుగానే భావించాలి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…