Surekha Vani : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పలు సినిమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇలా తన కూతురుతో కలిసి పలు డాన్స్ వీడియోలను చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సురేఖవాణికి సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే.

ఇక సురేఖవాణి పేరు మీద గత కొద్ది రోజుల నుంచి ఒక ఫోన్ నంబరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విషయంపై సురేఖవాణి స్పందిస్తూ సోషల్ మీడియాలో నా ఫోన్ నంబర్ అంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే అది నా నంబర్ కాదు. ఎవరూ కూడా అది నా నంబర్ అని కాంటాక్ట్ కావద్దు. అలాగే మీ పర్సనల్ డిటెయిల్స్ కూడా ఇవ్వకండి.. ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకండి.. అంటూ చెప్పుకొచ్చారు.
కొందరు కావాలనే తన పేరును వాడుకొని మోసాలకు పాల్పడుతున్నారని అందుకోసమే ఎవరూ తన ఫోన్ నంబర్ అంటూ వస్తున్న ఆ నంబర్ తో కాంటాక్ట్ కావద్దని సురేఖవాణి తన అభిమానులకు తెలియజేశారు. ఇక తనకు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తప్ప ఎలాంటి ఫేస్ బుక్, ట్విటర్ ఖాతాలు కూడా లేవని ఇదివరకే చెప్పానని, మరోసారి కూడా చెబుతున్నానని, తనకు ఎలాంటి ఖాతాలు లేవని, ఎవరు కూడా అలాంటి అకౌంట్ నుంచి మెసేజ్ లు వచ్చినా రియాక్ట్ అవ్వకండి.. అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పుకొచ్చారు.