RGV : రాంగోపాల్ వర్మ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉండే వర్మ తనకు ఏ మాత్రం అవకాశం దొరికినా పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేయడం ఏమాత్రం వదులుకోరు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికే ఎన్నో రకాల ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలిచిన వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలిచారు.

పవన్ కళ్యాణ్ కు ఎప్పుడూ వ్యతిరేకంగా కామెంట్లు చేసే వర్మ తాజాగా ఆయన నటించిన భీమ్లా నాయక్ సినిమా గురించి తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలతోపాటు రాజకీయాలలో కూడా పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ గురించి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడిన వీడియోని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్ చేశారు.
Hey @PawanKalyan sirrrr, ,please listen to the would be P M of INDIA. pic.twitter.com/TzUnFpZDJZ
— Ram Gopal Varma (@RGVzoomin) March 3, 2022
ఈ వీడియోలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ చెబుతున్నా.. ఆయన సీఎం కావాలన్నా.. మినిస్టర్ కావాలన్న.. నా పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధానిగా.. పవన్ కళ్యాణ్ ను ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా చేద్దాం.. తప్పేముంది.. అంటూ మాట్లాడిన వీడియోని వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. హేయ్ పవన్ సార్, ప్రధాని మాట్లాడుతున్నారు వినండి అంటూ క్యాప్షన్ పెట్టారు. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ ట్వీట్ పై ఎన్నో కామెంట్లు వస్తున్నాయి. ఇక ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు కేఏ పాల్ తోపాటు పవన్ కళ్యాణ్ ను కూడా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు.