Sunrisers Hyderabad : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 ఎడిషన్‌లో చెన్నై, ముంబై వంటి టీమ్‌లు చతికిలపడుతున్న విషయం విదితమే. అయితే చెన్నై ఎట్టకేలకు తమ 5వ మ్యాచ్‌లో గెలవగా.. ముంబై మాత్రం ఈ సీజన్‌లో ఇంకా బోణీ కొట్టలేదు. ఆడిన 5 మ్యాచ్‌లలో 5 ఓడిపోయింది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే.. మొదటి రెండు మ్యాచ్‌లు ఓడిపోయినా.. గత 2 మ్యాచ్‌లలోనూ నెగ్గి ఈ టీమ్ ఊపు మీద ఉంది. ఇక చివరిగా సన్ రైజర్స్ జట్టు తాజాగా గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది. ఈ క్రమంలోనే టీమ్ అంతా అరబిక్ కుతు సాంగ్‌కు డ్యాన్స్ చేసింది.
గుజరాత్ టైటాన్స్‌పై మ్యాచ్‌లో గెలిచిన అనంతరం హైదరాబాద్ ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌లో సందడి చేశారు. వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, జగదీశ సుచిత్‌లు అరబిక్ కుతు పాటకు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. దీంతో వారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు వరుస విజయాలతో సన్ రైజర్స్ టీమ్ మంచి జోరు మీదుందని.. ఆ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.
ఇక తళపతి విజయ్, పూజా హెగ్డె నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ మిశ్రమ టాక్‌ను తెచ్చుకుంటోంది. కొన్ని చోట్ల సినిమా బాగా లేదని విజయ్ ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించారు. ఒక చోట థియేటర్‌లో తెరను తగులబెట్టారు. అయితే ఈ మూవీలోని అరబిక్ కుతు పాట మాత్రం చాలా ఫేమస్ అయింది. ఇప్పటికే ఈ పాటకు ఎంతో మంది క్రీడా, సినీ సెలబ్రిటీలు డ్యాన్స్ చేసి తమ సరదా తీర్చుకున్నారు. తాజాగా సన్‌రైజర్స్ ప్లేయర్లు కూడా ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. ఈ క్రమంలో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…