KGF 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్‌కు సీక్వెల్ గా వచ్చిన చిత్రం.. కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ మూవీ గురువారం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 10వేలకు పైగా థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ అయి సంచలనాలను సృష్టిస్తోంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండడంతో సినిమా ఘన విజయం సాధించిందని అంటున్నారు. ఇక ఇందులో యష్ మాస్ యాక్షన్‌కు కేవలం కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రేక్షకులు అందరూ ముగ్ధులవుతున్నారు. ఈ క్రమంలోనే కేజీఎఫ్ చాప్టర్ 2 రికార్డుల వేటను కొనసాగిస్తోంది.
ఇక కేజీఎఫ్ మొదటి పార్ట్‌కు గాను డిజిటల్ హక్కులను స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం విదితమే. అయితే ఆ మూవీకి లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని కేజీఎఫ్ చాప్టర్ 2 డిజిటల్ హక్కులను కూడా అమెజాన్ ప్రైమ్ సంస్థే కొనుగోలు చేసింది. దీంతో అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్‌పైనే కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ స్ట్రీమ్ కానుంది. ఇక ఈ మూవీ విడుదలయ్యాక నెల రోజులకు అంటే.. మే 14వ తేదీ తరువాత ఓటీటీలో స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది.
గతంలో జీ5 సంస్థ ఈ మూవీకి గాను డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలు అబద్దమని తేలింది. కేజీఎఫ్ చాప్టర్ 2 డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సంస్థనే సొంతం చేసుకుంది. కనుక మూవీ అందులోనే స్ట్రీమ్ కానుందని అఫిషియల్ గా వెల్లడించారు. ఇక ఇందులో మూవీ స్ట్రీమ్ అయ్యే తేదీని కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…