Vantalakka : కార్తీక దీపం సీరియల్ ద్వారా వంటలక్కగా మనకు పరిచయం అయిన దీప అసలు పేరు.. ప్రేమి విశ్వనాథ్. ఈమె అసలు పేరు చాలా మందికి తెలియదు కానీ.. దీపగా.. వంటలక్కగా ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే మొన్నీ మధ్యే ఈ సీరియల్‌లో కార్తీక్, దీపల పాత్రలను చంపేశారు. దీంతో వారి కూతుళ్లతో సీరియల్‌ను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ప్రేమి విశ్వనాథ్ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ మేరకు ఆమె పోస్ట్ పెట్టింది.
తమ వద్ద పలు ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయని ప్రేమి విశ్వనాథ్ ఒక ప్రకటనను పోస్ట్ చేసింది. తమకు ఫోర్ వీలర్ (ఆటోమేటిక్, మాన్యువల్)లను నడిపే డ్రైవర్లు కావాలని.. అన్ని రకాల ఫోర్ వీలర్‌లను నడిపేవారు దరఖాస్తు చేయవచ్చని.. వాహనం బాగా నడపడం వచ్చి ఉండాలని తెలిపింది. అలాగే టాలీ వచ్చిన అభ్యర్థులు అకౌంటెంట్‌గా కావాలని చెప్పింది. వారికి కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలని తెలియజేసింది. దీంతో ప్రేమి విశ్వనాథ్ పెట్టిన ఈ ఉద్యోగ ప్రకటన పోస్ట్‌కు చాలా మంది స్పందిస్తున్నారు.
అయితే ఉద్యోగం చేయాలనుకునేవారు కొచ్చిలోని ఎర్నాకులంలో పనిచేయాలి. మరి అక్కడి ఉద్యోగాలకు ఇక్కడ ఎలా ప్రకటన ఇచ్చారో తెలియదు కానీ.. ఆసక్తి ఉన్నవారు.. అంత దూరం వెళ్లి పనిచేస్తాం.. అనుకునేవారు ఒకసారి ప్రయత్నించవచ్చు. ఇక ఆమె పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…