Suma : సుమ సినిమాకి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల‌.. ఇంట్రెస్టింగ్‌గా ఉందే..!

Suma : బుల్లితెర‌పై గ‌ల‌గ‌లా మాట్లాడుతూ అంద‌రి దృష్టినీ త‌న‌వైపుకు తిప్పుకునే యాంక‌ర‌మ్మ సుమ‌. ఓవైపు రియాల్టీ షోస్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్‏తో బిజీ బిజీగా గడిపేస్తుంటుంది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుని బుల్లితెరపై యాంకర్‏గా సెటిల్ అయ్యింది. స్టార్‌ యాంకర్‌గా దాదాపు రెండు దశాబ్దాలపాటు బుల్లితెరని ఏలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిల్వర్‌ స్క్రీన్‌ని ఏలేందుకు రాబోతోంది. 1996లో `కళ్యాణ ప్రాప్తిరస్తు` చిత్రంతో వెండితెరకి పరిచయమైంది సుమ.

`వర్షం`, `ఢీ`, `బాద్‌షా`, `ఓ బేబీ` చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన సుమ ఆ త‌ర్వాత సినిమాల‌లో పెద్ద‌గా క‌నిపించింది లేదు. అయితే అభిమానులు, సెల‌బ్రిటీల కోరిక మేర‌కు మ‌ళ్లీ తాను సినిమాల‌లోకి రావాల‌ని అనుకుంటోంది. తాను నటిగా ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ఓ వీడియోని విడుదల చేసింది. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ను ఇచ్చింది.

తాజాగా ప్రీ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేస్తూ.. ఇన్నాళ్లూ నన్ను బుల్లితెర మీద ఆదరించినందుకు, మీ సపోర్ట్‌కు థ్యాంక్స్.. దేవుడి దయతో ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఇస్తున్నాను.. అని పేర్కొంది సుమ‌. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వరవాణి కీరవాణి సంగీతమందిస్తున్నారు. పోస్టర్‌లో సుమ చేయి మీద వెంకన్న అనే పేరుతో ఉన్న పచ్చబొట్టు చూపించారు. నవంబర్ 6న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యబోతున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM