Suma : బుల్లితెరపై గలగలా మాట్లాడుతూ అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకునే యాంకరమ్మ సుమ. ఓవైపు రియాల్టీ షోస్.. మరోవైపు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్‌తో బిజీ బిజీగా గడిపేస్తుంటుంది. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుని బుల్లితెరపై యాంకర్‌గా సెటిల్ అయ్యింది. స్టార్ యాంకర్‌గా దాదాపు రెండు దశాబ్దాలపాటు బుల్లితెరని ఏలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌ని ఏలేందుకు రాబోతోంది. 1996లో `కళ్యాణ ప్రాప్తిరస్తు` చిత్రంతో వెండితెరకి పరిచయమైంది సుమ.
`వర్షం`, `ఢీ`, `బాద్‌షా`, `ఓ బేబీ` చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన సుమ ఆ తర్వాత సినిమాలలో పెద్దగా కనిపించింది లేదు. అయితే అభిమానులు, సెలబ్రిటీల కోరిక మేరకు మళ్లీ తాను సినిమాలలోకి రావాలని అనుకుంటోంది. తాను నటిగా ఓ సినిమా చేయబోతున్నట్టు ఇటీవల ఓ వీడియోని విడుదల చేసింది. తాజాగా ఆ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ను ఇచ్చింది.
తాజాగా ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేస్తూ.. ఇన్నాళ్లూ నన్ను బుల్లితెర మీద ఆదరించినందుకు, మీ సపోర్ట్‌కు థ్యాంక్స్.. దేవుడి దయతో ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఇస్తున్నాను.. అని పేర్కొంది సుమ. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నం.2 గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు విజయ్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వరవాణి కీరవాణి సంగీతమందిస్తున్నారు. పోస్టర్‌లో సుమ చేయి మీద వెంకన్న అనే పేరుతో ఉన్న పచ్చబొట్టు చూపించారు. నవంబర్ 6న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ రిలీజ్ చెయ్యబోతున్నారు.
https://www.instagram.com/p/CVz-ubPJwGu/?utm_source=ig_embed&ig_rid=862f9ecc-1fb5-43f5-a8ae-70536f75128a