Manchu Lakshmi : మా ఎన్నికల గురించి కానీ.. అందులో పోటీ చేసిన నటుల గురించి కానీ.. అల్లు ఫ్యామిలీ.. ముఖ్యంగా అల్లు అర్జున్ ఎన్నడూ కామెంట్లు చేసింది లేదు. ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారం.. తరువాత ఎన్నికలు.. అనంతరం ఏర్పడిన వివాదాలు.. వేటిపై కూడా అల్లు అర్జున్ స్పందించలేదు. అయితే తాజాగా ఆహా 2.0 ఈవెంట్‌లో మంచు లక్ష్మిని అల్లు అర్జున్ ప్రత్యేకంగా సంబోధించడం చర్చనీయాంశంగా మారింది.
మంచు లక్ష్మి ఇప్పటికే ఆహాతో భాగస్వామ్యం అయి ఓ కుకింగ్ షోను నిర్వహించిన విషయం విదితమే. మొన్నీ మధ్యే బాలయ్యకు చెందిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోలో అతిథిగా పాల్గొన్నారు. ఆమె ఇంగ్లిష్, తెలుగు కంబైన్డ్ యాస సినీ ప్రేక్షకులకు నచ్చలేదు. కానీ బుల్లితెర ప్రేక్షకులు మాత్రం ఆమె మాట్లాడేవిధానాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఇటీవలి కాలంలో పలు కార్యక్రమాలకు యాంకర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇక తాజాగా నిర్వహించిన ఆహా 2.0 ఈవెంట్‌కు కూడా మంచు లక్ష్మి యాంకర్‌గా వ్యవహరించారు. ఈ క్రమంలో ఓ సందర్భంలో అల్లు అర్జున్.. మంచు లక్ష్మిని ప్రెసిండ్ గారి అక్క.. అని సంబోంధించారు. ఇటీవల మంచు లక్ష్మి సోదరుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అల్లు అర్జున్ ఆమెను ఆ విధంగా సంబోధించి ఆశ్చర్యపరిచారు.
అయితే వెంటనే స్పందించిన మంచు లక్ష్మి కూడా.. ప్రెసిడెంట్ అక్కడ అయితే ఏంటి.. ఎన్నో సమస్యలు, వివాదాలు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి.. అని పేర్కొంది. దీంతో ఈవెంట్‌లో నవ్వుల పువ్వులు పూశాయి. కాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ డిసెంబర్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ హిందీ రిలీజ్ విషయమై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడం కోసం బన్నీ స్వయంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…