Sri Reddy : సంచలన తార, వివాదాస్పద నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి చేసే వ్యాఖ్యలు సంచలనం సృష్టి స్తుంటాయి. ఇక మీ టూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఎంతో మంది బడా బాబుల బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి ప్రస్తుతం చెన్నైలో నివసిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలు రాజకీయ అంశాలు, సామాజిక అంశాలపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు చేసే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో ముచ్చటించింది.
ఈ సందర్భంగా అభిమానులతో చిట్ చాట్ చేసిన శ్రీ రెడ్డికి ఓ నెటిజన్ ఎంతో ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. సదరు నెటిజన్.. ఇంతకూ మీకు పెళ్లి అయ్యిందా ? అనే డౌట్ అడగడంతో అందుకు శ్రీరెడ్డి సమాధానం చెబుతూ.. తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుత కాలంలో ఒక అబ్బాయి, అమ్మాయి ఎక్కువ రోజులు వారి రిలేషన్ లో ఉండటం లేదు. కొన్ని మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకుంటున్నారు.
ఒకవేళ తన జీవితంలో తనకు తోడుగా జీవిత కాలం ఉండబోయే మగాడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటానని ఈ సందర్భంగా ఈమె తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. అదే విధంగా ప్రస్తుత కాలంలో ఆడవాళ్ళలో కూడా అంత పతివ్రతలు ఎవరూ లేరంటూ అమ్మాయిల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన ఒంటిపై 5 టాటూలు ఉన్నాయని, అప్పుడప్పుడు మందు తాగుతా.. అనే విషయాలను కూడా ఈ సందర్భంగా శ్రీ రెడ్డి అభిమానులకు తెలియజేసింది.