Allu Arjun : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మన టాలీవుడ్ హీరోలు కూడా అదే సామెతను అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వీరు పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్న హీరోలు పలు వ్యాపార రంగంలోకి అడుగు పెడుతూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు.
ఇప్పటికే విజయ్ దేవరకొండ, మహేష్ బాబు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు మల్టీప్లెక్స్ థియేటర్లను నడుపుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి బాటలో అల్లు అర్జున్ థియేటర్స్ బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. హైదరాబాద్ సిటీలోని అమీర్ పేట్ లో AAA మల్టీప్లెక్స్ నిర్మించనున్న సంగతి మనకు తెలిసిందే. అల్లు అరవింద్, మురళీమోహన్, నారాయణ దాస్, సదానందం గౌడ్ భాగస్వామ్యంలో ఈ మల్టీ ప్లెక్స్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను శనివారం జరపడంతో ఈ పూజా కార్యక్రమాలలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నారు. హైదరాబాద్ ప్రజలను ఆకట్టుకునే విధంగా ఈ మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నామని తెలిపారు .ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.