Sreemukhi : యాంకర్ శ్రీముఖి ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. బుల్లితెర రాములమ్మగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె ఈ మధ్య కాలంలో బుల్లితెరకు కాస్త దూరం అవుతోంది. ఏదైనా ప్రత్యేక ఈవెంట్లలో మాత్రమే శ్రీముఖి సందడి చేస్తోంది. ఇక శ్రీముఖి సినిమా అవకాశాలు దక్కించుకుని వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈమె నటించిన క్రేజీ అంకుల్స్ విడుదలయింది. అయితే ఈ చిత్రం పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఈ క్రమంలోనే ఈమె మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉంది. ఇక కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా శ్రీముఖి ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్‌ను షేర్ చేస్తుంటుంది.
అందులో భాగంగానే తాజాగా ఆమె బ్లాక్ డ్రెస్ ధరించిన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
నలుపు రంగు దుస్తులలో కుందనపు బొమ్మలా ఉన్న ఈమె ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ప్రస్తుతం శ్రీముఖి స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.