Sreeja : మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ, కల్యాణ్ దేవ్‌లు ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరు గత కొంత కాలంగా విడిగా ఉంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరు త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఆల్రెడీ వీరు విడాకులు తీసుకున్నారని.. కానీ ఆ విషయాన్ని బయటకు చెబితే పరువు పోతుందని.. కనుక ఆ విషయాన్ని గుట్టుగా దాచి ఉంచారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక శ్రీజ, కల్యాణ్ గతంలో ఎప్పుడు కనిపించినా ఇద్దరూ కలిసే ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో వారు పెడుతున్న సోషల్ మీడియా పోస్టుల్లో ఇద్దరూ కలసి కనిపించడం లేదు. వేర్వేరుగానే పోస్టులు పెడుతున్నారు. దీంతో ఇద్దరూ విడిపోయారనే వార్తలకు బలం చేకూరినట్లు అయింది.
ఇక శ్రీజ చిన్న కుమార్తెకు గతంలో కల్యాణ్ దేవ్ బర్త్ డే విషెస్ చెప్పాడు. కానీ పెద్ద కుమార్తెకు మాత్రం విషెస్ చెప్పలేదు. దీంతో ఇద్దరికీ మనస్ఫర్థలు వచ్చాయని మళ్లీ వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే దీనిపై అటు కల్యాణ్ దేవ్ కానీ.. ఇటు మెగా కాంపౌండ్ కానీ స్పందించలేదు. కానీ తాజాగా మళ్లీ ఇంకో వార్త ప్రచారం అవుతోంది. అదేమింటే.. కల్యాణ్ దేవ్‌కు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని.. ఆ విషయం తెలిసిన శ్రీజ అతన్ని దూరం పెట్టిందని.. కనుకనే ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారని.. వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం ఎంత ఎంది.. అన్న విషయం తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇవి బాగా ప్రచారం అవుతున్నాయి.
ఇక గతంలో కల్యాణ్ దేవ్‌పై కూడా పలు రూమర్స్ వినిపించాయి. మామ చిరంజీవి పేరు చెప్పి ఆయన నిర్మాతలు, దర్శకులను ఇంటికి పిలిపించుకుని తనతో సినిమా చేయాలని వారి బలవంత పెట్టాడని.. అయితే ఈ విషయం తెలిసిన చిరంజీవి కల్యాణ్ దేవ్‌ను మందలించారని.. అందుకనే అతను మెగా కాంపౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ దీనిపై క్లారిటీ రాలేదు. ఇక తాజాగా మళ్లీ కల్యాణ్ దేవ్‌కు ఇంకో అమ్మాయితో సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో కూడా నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…