Krithi Shetty : యంగ్ బ్యూటీ కృతి శెట్టి జోరు మామూలుగా లేదు. కెరీర్ లో తొలి సినిమా షూటింగ్‌లో ఉండగానే ఇతర సినిమాల్లో చాన్స్‌లు కొట్టేసింది ఈ బ్యూటీ. సాధారణంగా ఇలా చాలా అరుదుగానే జరుగుతుంటుంది. ఉప్పెన షూటింగ్‌లో ఉండగానే ఈమెకు శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాల్లో ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ మూవీల్లో ఈమె నటించింది. దీంతో మూడు సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. ఒక మూవీ హిట్ అయితేనే హీరోయిన్లకు వరుస అవకాశాలు వస్తాయి. అలాంటిది మూడు సినిమాలు వరుసగా హిట్ అంటే.. బేబమ్మ జోరు ఏవిధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే ఆమెకు వరుస సినిమాల్లో అవకాశాలు కూడా వస్తున్నాయి.
అయితే అంతా బాగానే ఉంది కానీ కృతిశెట్టి సూర్య సినిమాలో నటించడం ద్వారా రాంగ్ స్టెప్ వేసిందని అంటున్నారు. సూర్య అంటే మామూలు నటుడు కాదు. కానీ అగ్ర హీరోలతో నటిస్తే తరువాత యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయి. అలా గతంలో నటి ఆర్తి అగర్వాల్‌కు జరిగింది. ఆ తరువాత ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి. దీంతో కృతిశెట్టి సూర్య మూవీలో యాక్ట్ చేయడం ద్వారా రాంగ్ స్టెప్ వేసిందని అంటున్నారు. దీంతో ఈమెకు యంగ్ హీరోలు అవకాశాలు ఇస్తారా.. అని చర్చించుకుంటున్నారు.
ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ బ్యూటీ ఈ మధ్యే ఓ యువ హీరోతో ప్రేమలో పడిందని అంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ హీరో ఎవరు అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఈమె సరిగ్గా ఆర్తి అగర్వాల్ చేసినట్లే చేస్తుందని అంటున్నారు. ఆమె కూడా అప్పట్లో అగ్ర హీరోల సినిమాల్లో నటించడంతోపాటు ఓ యువ హీరోతో ప్రేమలో పడింది. దీంతో కెరీర్‌కు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో ఆర్తి అగర్వాల్ ఇలా కెరీర్‌ను అర్థాంతరంగా ముగించింది. ఓ దశలో సూసైడ్‌కు కూడా యత్నించింది. లవ్ ఫెయిల్యూర్ వల్లే ఆమె అలా చేసిందని అన్నారు.
అయితే కృతిశెట్టి విషయంలోనూ సరిగ్గా అలాగే జరుగుతుందని అంటున్నారు. ఆర్తి అగర్వాల్‌లాగే ఈమె కూడా అగ్ర హీరోల సరసన నటిస్తుండడంతోపాటు ఓ హీరోతో ప్రేమలో పడిందని అంటున్నారు. మరి ఆర్తి అగర్వాల్‌లా కాకుండా కృతి శెట్టి తన కెరీర్‌ను సరైన దారిలో వెళ్లేలా చేసుకోగలదా.. లేక ఆర్తి అగర్వాల్‌లాగే కెరీర్‌కు నష్టం కలిగించుకుంటుందా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడీ విషయం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…