OTT : వారం వారం కొత్త సినిమాలు, సిరీస్ లు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వారం మారాక ఈ వారం ఏయే మూవీలు రిలీజ్ అవుతున్నాయి.. అని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుత తరుణంలో ఓటీటీల పుణ్యమా అని థియేటర్లలో వచ్చిన సినిమాలను నెల రోజులు తిరక్కుండానే ఓటీటీల్లో వీక్షిస్తున్నారు. దీంతో ఓటీటీ సంస్థలు కూడా కొత్త మూవీలను ప్రేక్షకులకు అందించేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి నటించిన సమ్మతమే మూవీ ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఆహా ప్లాట్‌ఫామ్‌పై ఈ నెల 15వ తేదీన ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. అలాగే కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన వాశి అనే మళయాళం మూవీ కూడా ఈ వారంలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మూవీని ఈ నెల 17వ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారు.
ఇక విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మామణిథన్ అనే తమిళ మూవీని ఆహా తమిళ యాప్‌లో ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేయనున్నారు. మా నీళ్ల ట్యాంక్ అనే కామెడీ డ్రామా సిరీస్‌లో సుశాంత్, ప్రియా ఆనంద్ నటించగా.. ఈ సిరీస్ జీ5 యాప్‌లో ఈ నెల 15వ తేదీన రిలీజ్ కానుంది.
పంచాయత్ ఫేమ్ జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన జాదుగర్ అనే సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సిరీస్ ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఇది హిందీలో అందుబాటులో ఉంటుంది. ఇలా పలు మూవీలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఈ వారం అలరించనున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…