Sravana Bhargavi : గత కొంతకాలంగా సోషల్ మీడియాలో శ్రావణ భార్గవి ట్రెండ్ నడుస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్నటికి మొన్న ఆమె భర్త హేమచంద్ర, శ్రావణ భార్గవి ఒకటిగా కలసి లేరని, త్వరలో విడాకులు తీసుకున్నారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దాదాపు కొన్ని రోజులు సైలెంట్ గా ఉండి, ఈ జంట మేము కలిసే ఉన్నాం, లేనిపోని వార్తలతో మమ్మల్ని విడదీయకండి అంటూ ఒక్క పోస్ట్ తో అందరి నోళ్ళు మూయించారు. 2018 లో వచ్చిన శ్రీనివాస కళ్యాణం చిత్రంలో పాటలు పాడి అందరినీ ఆకట్టుకుంది శ్రావణ భార్గవి. ఆ తర్వాత సినిమా రంగానికి దూరంగా ఉండి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తనదైన శైలిలో పాటలు పాడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
విడాకుల వార్త తర్వాత ఆమె యూట్యూబ్ ఛానల్ లో ఒకపరి భక్తి పాటతో తనకు నచ్చిన విధంగా వీడియోను క్రియేట్ చేసుకొని అప్‌లోడ్ చేసింది. ఇది కాస్తా సంచలనంగా మారి అన్నమయ్య వంశాచార్యులు అంతటి గొప్ప భక్తి పాటను శ్రావణ భార్గవి అవమానించింది అంటూ మండిపడ్డారు. ఈ గొడవతో ఒక్కసారిగా శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో మళ్లీ హైలెట్ అయిపోయింది. అంతే కాకుండా మంచి పాపులారిటీని కూడా సంపాదించుకుంది. అన్నమయ్య వంశాచార్యులు ఆమెపై కేసు పెట్టడానికి కూడా సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఆమె వెనక్కు తగ్గి వీడియోను డిలీట్ చేసింది.

ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో శ్రావణభార్గవి హవా స్టార్ట్ అయింది. ఈ ఆగష్టు 25న విడుదల కాబోతున్న రౌడీ బాయ్ హీరో విజయ్ దేవరకొండ లైగర్ చిత్రంలో ఓ అద్భుతమైన పాటను పాడింది. ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో వీక్షకులను ఉర్రూతలూగిస్తోంది. లైగర్ చిత్రంలో వచ్చిన ఆఫత్ అనే రొమాంటిక్ పాటకు తెలుగు వెర్షన్ శ్రావణ భార్గవి గాత్రాన్ని అందించింది. ఇక సినిమా విడుదల తర్వాత ఈ పాట దుమ్ము లేపినా ఆశ్చర్యపడనవసరం లేదు. మళ్లీ ఇంత కాలం తర్వాత శ్రావణ భార్గవి చిత్రాలకు పాటలు పాడటం ద్వారా ఆమె అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.