Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పవన్‌కు విడాకులు ఇచ్చారు. పవన్‌తో విడాకుల అనంతరం రేణు తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఒకప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లతో టచ్‌లో ఉండేది. పైగా కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ టైంలలో ఎంతో మందికి సహాయం చేసి మంచి మనసును చాటుకుంది. థర్డ్ వేవ్‌లో తానే కరోనా బారిన పడి ఇంటి నుంచి బయటకు రాలేదు.
కరోనా తరువాత రేణు దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ అంటూ ఆ మధ్య కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఆ తరువాత రేణు దేశాయ్ తన పిల్లలను తీసుకుని ఫారిన్ ట్రిప్‌కు వెళ్లింది. ఆద్య చేస్తోన్న అల్లరిని ఎప్పటికప్పుడు చెబుతూనే వస్తోంది. అయితే రేణు దేశాయ్‌కి సామాజిక స్పృహ ఎక్కువే. చెట్లు, అడవులు, రోడ్లు, ప్రకృతి అంటూ ఇలా ప్రతి ఒక్క అంశం మీద స్పందిస్తుంటుంది. రేణూ దేశాయ్ పూర్తి శాకాహారిగా మారిన సంగతి తెలిసిందే. పాలు, పాల పదార్థాలు ఏవీ ముట్టరు. జంతువుల నుంచి వచ్చిన ఏ పదార్థమూ, వాటిని హింసించి తీసుకునే వేటినీ ఆహారంగా తీసుకోరన్నమాట.

తాజాగా పెట్టిన పోస్ట్ లో రేణు దేశాయ్ ఇలా రాసుకొచ్చారు. పాలు, పాల పదార్థాలు వాడినా కూడా మనం ఆవులు, గేదెలను చంపినట్టే అని నాకు అర్థమైంది. నెయ్యి, వెన్న వంటి పదార్థాలను మానేయడం చాలా కష్టమైన పనే.. కానీ పాల పరిశ్రమ అంత దారుణమైంది మరొకటి ఉండదు అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇది చూసి నెటిజన్లు రేణు దేశాయ్ ని గ్రేట్ జాబ్ అంటూ అభినందిస్తున్నారు.