Sonu Sood : కరోనా కాలంలో చేతికి ఎముక లేదన్నట్టు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అందరి మనసులలోనూ చెరగని ముద్ర వేసుకున్నాడు సోనూసూద్. సోమవారం హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో కోవిడ్ వారియర్స్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు సినీ నటుడు సోనూసూద్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. ఎలాంటి స్వార్ధం లేకుండా మానవత్వంతో సేవా భావం చాటుకున్నారు సోనూసూద్. సమాజం సవాళ్లు ఎదుర్కొంటున్నపుడు ఒక్క ప్రభుత్వమే అన్నీ చేయలేదని, స్వచ్ఛంద సంస్థల చేయూత ఎంతైనా అవసరం అని పేర్కొన్నారు. సోనూ సూద్ సేవ చేస్తే ఐటీ దాడులు, ఈడీ సోదాలు చేసి ఆయన్ని భయపెట్టాలని చూశారు. ఆయన భయపడాల్సిన అవసరం లేదు. తామంతా సోనూ వెంట ఉన్నామని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్.
కేటీఆర్ లాంటి నాయకుడు ఉంటే నాలాంటి వాళ్ళు ఎక్కువ పనిచేయాల్సిన అవసరం ఉండదని అన్నారు సినీ నటుడు సోనూ సూద్. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఏడున్నర లక్షల మందికి సహాయం అందించినట్లు చెప్పారు. ఆక్సిజన్, మందులు, బెడ్స్ కావాలంటూ అర్థరాత్రులు కూడా కాల్స్ వచ్చేవని అన్నారు సోనూసూద్. కోవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారని అన్నారు. వాళ్లకు సహాయ పడడమే ఇక తన ముందున్న సవాల్ అని సోనూ స్పష్టం చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…